భూములు కొన్న వాళ్ల గురించి తెలుసా?
వారం వ్యవధిలోనే ఎకరాకు రూ.5కోట్లు పెరిగిన ప్రభుత్వ భూమి
రికార్డ్ ధరతో రాయదుర్గం ప్లాట్ పీ2 స్వాధీనం చేసుకున్న వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి
ఈ నెలలోనే 11 ఎకరాలు అమ్మగా ప్రభుత్వానికి రూ.2,833 కోట్ల ఆదాయం
పాల పొంగా.. దేశ రాజకీయాలను శాసించేందుకు ఆదర్శమా?
రెవెన్యూ శాఖలో వివాదాలకు.. వేలం పాటలో అధిక ధరలకు లింక్ ఏంటో తెలుసా?
ఇదే సర్వే నెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ స్కీంలో ఈ కంపెనీకి వెయ్యి కోట్ల గ్యారెంటీ అని ఎంతమందికి తెలుసు?
రైజింగ్ రియల్ ఎస్టేట్‌పై స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్
రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబర్ 83/1 బంగారు గని. అందరి కళ్లు రాయదుర్గం పైనే అంటూ 15 రోజుల క్రితం స్వేచ్ఛ న్యూస్ కథనం ఇచ్చింది. అందుకు ఆ సర్వే నెంబర్స్‌లో ఉన్న లిటిగేషన్స్‌పై నిఘా ఉంచుతామని కూడా స్పష్టం చేసింది. అనుకున్నట్లే వారం వ్యవధిలోనే ఎకరం రూ.5 కోట్లు అదనంగా ప్రభుత్వ భూమి రేటు పెరిగింది. రెవెన్యూ మంత్రి గతంలో ప్రభుత్వం వేలంలో కొనుగోలు చేసిన భూములను సైతం ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి దందా చేయాలనుకున్నారు. ఇప్పుడు అమ్మిన భూములపై కూడా అనేక కేసులు ఉన్నాయి. ఎస్‌బీఐ బ్యాంకు గౌర రియల్ ఎస్టేట్ వేలం పాడుకున్న భూమిపై కోర్టుకు వెళ్లింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఎస్బీఐ అకౌంట్స్ మొత్తం స్తంభింపచేస్తామని హెచ్చరించింది. ఒక రకంగా బ్లాక్‌మెయిల్ అన్నట్లే. ఇలా ఆ తర్వాత వక్ఫ్ కేసులు వేశారు.
రాయదుర్గం వేలం ఒక్కటే ఎందుకు హైలైట్?
ఒక్క ఎకరం 250 కోట్లు అంటే దాని చుట్టుపక్కల 10 కిలో మీటర్ల దూరం కనీసం రూ.200 కోట్లు ఉండాలి. 100 కిలో మీటర్లకు రూ.2 కోట్లు అయినా పలకాలి. కానీ, అలా లేదు. ఇక్కడే ఈ రియల్ సంస్థలు ఎందుకు అధిక ధరలకు పోతున్నాయో తెలిస్తే షాక్ అవుతారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారే ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. కోకాపేట వేలంలో ఎలాంటి వ్యాపార వ్యవహారం జరిగిందో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలుసు. కోకాపేటలో డబ్బులు కట్టే పరిస్థితి లేని నుంచి ఇక్కడ, ఎక్కడ లేని విధంగా పదెకరాలకు రూ.2,800 కోట్ల ధరతో పాటు కొనుగోలు చేయాల్సిన అవసరం వచ్చిన సంఘటనలు ఉన్నాయి.
ఎంఎస్ఎన్ రియాల్టీ ఎందుకు పెట్టింది?
ఫార్మాలో ఎంఎస్‌ఎన్ రెడ్డి ఒక విజన్ ఉన్న సైటిస్ట్. దాంతో ఎన్నో వేల కోట్లు సంపాదించారు. అందుకే ఎవరికీ తెలియని వ్యక్తి అయినా కూడా కేసీఆర్ హయాంలో శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా టికెట్ తీసుకుని గెలుపొందారు. అలాంటి సంస్థకే కాంగ్రెస్ ఎంతో లబ్ది చేకూర్చిందని ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి పవిత్రమైన గుడికి ఛైర్మన్ చేశారు. ఈ కుటుంబంలో మరొకరికి స్పోర్ట్స్ కోటాలో సెక్రెటరీగా ఏకగ్రీవం చేశారు. వివాదాల హెచ్‌సీఏలో ఆ సెక్రెటరీ మంచి పేరు తీసుకొచ్చారని టాక్. అయితే, ఫార్మా రంగం భవిష్యత్తులో ఉండదని గ్రహించిన ఎంఎస్ఎన్ గ్రూప్ రియల్ ఎస్టేట్‌కు వచ్చేసింది. కోకాపేటలోనే కేసీఆర్ హయాంలో కొనుగోలు చేసి అరంగేట్రం చేసింది. ఇప్పటికే డబ్బలు భారీగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్‌లో ఫార్మా కంపెనీ అయిన అరబిందో భారీ ప్రాజెక్ట్స్ చేసింది. తెర వెనుక ఎక్కడ ఎలాంటి లబ్ది జరగుతుందో కొద్ది రోజుల్లో ప్రజలకు తెలిసిపోతుంది. స్వేచ్ఛ న్యూస్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.
వంశీరాం వేలం వేయాల్సి వచ్చింది?
లిటిగేషన్ ల్యాండ్స్‌లో 10 పైసలు పెట్టి వంద రూపాయలు సంపాదించాలనే వంశీరాం సుబ్బారెడ్డి, పొలిటికల్ లీడర్స్‌కు 40 శాతం ఖర్చు చేస్తారని టాక్. అందుకు ఖాజాగూడ సర్వే నెం. 27లో 27 ఎకరాల వ్యవహారాలను స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి వెలికి తీశారు. ఆ ఆధారాలతోనే అన్నిమీడియా సంస్థలు లబ్ది పొందాయి. అలానే ఎమ్మెల్యేలు కూడా కేసులు వేశారు. ఇలా మొన్నటి మొన్న ఓ వేలంలో కేంద్ర ప్రభుత్వ స్కీం అయిన పీఎం ఏక్తా మాల్ పేరుతో ఇక్కడ భవన నిర్మాణం టెండర్స దక్కించుకున్నారు. అందుకు అపర్ణ, వంశీరాం నిర్మాణం చేసేలా ప్లాన్ వేసుకున్నారు. 6.4 ఎకరాల్లో నిర్మాణం పూర్తి అయితే 18 లక్షల స్క్వేర్ ఫీట్‌లో రూ.3,600 కోట్ల లబ్ది పొందనున్నారు. అందులో మొదటగా పెట్టుబడి ఖర్చు అపర్ణ పెట్టుకుంటుంది. ఆ తర్వాత వంశీరాం ఒప్పందం ఉంది. ఎలాంటి పెట్టుబడి లేకున్నా వెయ్యి కోట్లు సంపాదించేందుకు వంశీరాంకు ఈ ప్రాజెక్ట్‌లో వీలుంది. ఒక ఎకరం రూ.269 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. పైగా నిర్మాణానికి రూ.200 కోట్లు కేంద్రం ఇవ్వనుంది. దీనికి తోడుగా కేంద్ర బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ప్రభుత్వం కోరినట్లు 30 శాతం బిల్డింగ్‌లో నిర్మాణం ఇస్తే అన్ని హక్కులు వారికే. మొత్తంగా దీని వెనుక నేరుగా రూ.2 వేల కోట్ల స్కాం దాగి ఉంది. అందుకే వంశీరాంకు అక్కడ ఖాజగూడ, ఇక్కడ రాయదుర్గంలో మంచి పంట పండుతుందని మీరే కొనుగోలు చేయాలని ఒత్తిడి పెరిగినట్లు సమాచారం.
వేలం వేస్తే అప్లై కూడా చేసుకోలేని భూములు ఎన్నో?
టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, హౌజింగ్ బోర్డులో భూములకు ఇటీవల కాలంలో వేలం వేశారు. కొన్నింటికి మాత్రమే స్పందన వచ్చింది. మిగితా భూముల కోసం కనీసం మినిమం రేటు కూడా రాలేదు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి రైజింగ్‌కు వేలం రేసింగ్ ఉందని చెప్పడానికి కారణం ఉందా లేదా? ఆధారాలతో సహా ముందు ఉంచేందుకు స్వేచ్ఛ ఎప్పుడూ రెడీగా ఉంటుంది.












