స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

సుమంత్ కేసులో సంచలనాలు.. పోలీసుల తీరుపై పలు అనుమానాలు!

రచన: Swechaanews Chairman6 నిమిషాల పఠనం

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్, వ్యాపారి గొంగిడి హరికృష్ణల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ, రూ.10కోట్ల వసూళ్ల వివాదంలో పోలీసుల విచారణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సుమంత్, అతడి అనుచరులను అరెస్ట్ చేయడంపైనే దృష్టి సారించిన పోలీసులు, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వసూళ్లకు సంబంధించిన లోతైన అంశాలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్, వ్యాపారి గొంగిడి హరికృష్ణల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ, రూ.10కోట్ల వసూళ్ల వివాదంలో పోలీసుల విచారణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సుమంత్, అతడి అనుచరులను అరెస్ట్ చేయడంపైనే దృష్టి సారించిన పోలీసులు, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వసూళ్లకు సంబంధించిన లోతైన అంశాలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జూలై 30న దాడి జరిగిందని చెబుతున్న హరికృష్ణ, చాలా రోజుల ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, అలాగే ఫిర్యాదు సమయంలో సీఎంతో సన్నిహిత సంబంధాలు కలిగిన కిరణ్ అనే వ్యక్తి ఆయన వెంట ఉండటం వెనుక పెద్ద రాజకీయ కోణమే దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆ కిరణ్ ఎవరు? అసలు ఈ మొత్తం వ్యవహారం ఎక్కడ మొదలైంది? అసలు దీని వెనుక ఎవరున్నారు?ఈ మొత్తం వ్యవహారానికి మూలం అటవీ భూముల ఎన్‌ఓసీలు (NOC), భూ వివాదాల సెటిల్మెంట్ల చుట్టే తిరుగుతోంది.

నిజాంపేట్‌లోని 5ఎకరాల భూవివాద పరిష్కారం పేరుతో హరికృష్ణ రూ.1.80కోట్లు వసూలు చేశారంటూ ఆగస్టు 2న మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనా, దానిపై నెల రోజులుగా ఎలాంటి పురోగతి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మంత్రి కొండా సురేఖ పేరును, వారి కార్యాలయాన్ని వాడుకుని జనగామ, భూపాలపల్లి ప్రాంతాల్లో కోట్ల రూపాయల లంచాలు వసూలు చేశారనే ఆరోపణలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వెనుక కొందరు ముఖ్య నేతల హస్తం ఉందనే చర్చ పోలీస్ వర్గాల్లో సాగుతోంది. సుమంత్ టార్గెట్‌గా జరుగుతున్న ఈ వ్యవహారంలో కొత్త కోణాలు వెతుకవద్దంటూ ముఖ్యనేత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన కొన్ని పరిణామాల ఆధారంగా ఇన్‌స్పెక్టర్ ముత్యాలయాదవ్ సస్పెన్షన్, అలాగే పీఎస్‌లోని 15గంటల సీసీటీవీ ఫుటేజీని బయటకు రాకుండా తొక్కిపెట్టడం వెనుక ఆ ముఖ్యనేత నడిపిస్తున్న శక్తులు ఉన్నట్లు సమాచారం. కేవలం ఒక వైపు మాత్రమే విచారణ జరుపుతూ అసలు బాధితులను, వసూళ్లకు పాల్పడ్డ వారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూకబ్జాలు, ఎన్‌ఓసీల దందాల వెనుక ఉన్న నిజమైన దోషులను బయటకు తీయకుండా, కేసును పక్కదారి పట్టిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నిజాంపేట్ భూవివాదం.. తర్వాతి పరిణామాలు ఇవే..

అనుషః ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ ముత్యాల మనోహర్‌రెడ్డికి కూకట్‌పల్లి నిజాంపేట్‌లోని 5 ఎకరాల స్థలానికి సంబంధించిన మ్యూటేషన్, సర్వే సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి గొంగిడి హరికృష్ణ నమ్మబలికాడు. తనకు అధికారులు, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో మనోహర్‌రెడ్డి ఆయనను నమ్మారు. ఈ క్రమంలోనే సంస్థ నుంచి గొంగిడి హరికృష్ణతో పాటు ఆయన సూచించిన సుర్కంటి రఘువీరారెడ్డి ఖాతాలకు రూ.1.80కోట్లకు పైగా నగదు బదిలీ చేశారు.

 గత నెల 30న జరిగిన ఓ ఘటన అనంతరం హరికృష్ణను జూబ్లీహిల్స్ పీఎస్‌కు పంపగా, ఆయనపై ఫిర్యాదు చేసేందుకు సుమంత్ వర్గం మరుసటి రోజు ప్రయత్నించింది. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఖాకీ ముఖ్యులు నచ్చజెప్పడంతో పాటు, అసలు బాధితులతోనే కేసు పెట్టించాలని సుమంత్‌కు సూచించారు. ఆ సలహాతోనే ఈ నెల 2న మాదాపూర్ పీఎస్‌లో ముత్యాల మనోహర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా.. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. మాదాపూర్‌లో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై నెల గడిచినా ఎలాంటి సమాచారమూ లేదు. ఈలోగా కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత హరికృష్ణతో ఫిర్యాదు చేయించినట్లు అధికారపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

#KondaSurekha#OSDSumanth#JubileeHillsPS#LandScam#TelanganaPolitics#NamastheTelangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి