King 100: ఈరోజు (ఆగస్టు 29) టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున పుటినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న బెంచ్ మార్క్ ఫిల్మ్ 100వ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే కటిక పేదవాడి నుంచి అపర కోటీశ్వరుడి వరకూ నాగార్జున ఎదిగిన ప్రయాణాన్ని చూపించబోతున్నట్టుగా అర్థమవుతోంది. మొత్తానికి, అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కింగ్ 100 నుంచి గ్లింప్స్ రిలీజై ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎక్కువగా సహసాలు చేసేది నాగార్జున. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా అవకాశాలు ఇచ్చేది నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థపై ఇప్పటికే, ఎందరో దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమై అగ్ర దర్శకుల జాబితాలోకి చేరారు. ఇప్పుడు, ఆ లిస్ట్ లో రా.కార్తీక్ కూడా చేరబోతున్నాడు. టాలెంట్ ఉంటే నాగార్జున ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడని అందరికీ తెలిసిందే.
రా.కార్తీక్ కి నాగ్ తన 100వ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడంటే అతనిలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అది, తాజాగా వచ్చిన కింగ్ 100 గ్లింప్స్ తో క్లారిటీ వచ్చేసింది. రా.కార్తీక్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా. తమిళంలో కూడా పెద్ద అనుభవం లేదు. కానీ, కమర్షియల్ సినిమా చేయగల సత్తా, టాలెంట్ ఉన్నాయి. కాబట్టే, నాగ్ 100 వ సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.
ఇక, తాజాగా విడుదలైన గ్లింప్స్ విషయానికొస్తే..మనుషుల్లో రెండు రకాలు..డబ్బున్నోళ్ళు..డబ్బు లేనోళ్ళు..డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు..డబ్బున్నప్పుడు దే కాల్ మీ కింగ్..అంటూ నాగార్జున చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఐడెంటిటీ మోర్ పవర్ ఫుల్ మనీ అనే పాయింట్ చుట్టూ నాగార్జున రోల్ డిజైన్ చేసినట్టుగా అర్థమవుతోంది. మొత్తానికి, చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ సాలీడ్ యాక్షన్ సినిమాతో నాగ్ రాబోతున్నాడని తాజాగా విడుదల చేసిన ఒక నిముషం 20 సెకన్ల గ్లింప్స్ చెబుతుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.












