Deepika Padukone: లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొన్ చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ప్రభాస్ అభిమానులు దీపికను గట్టిగానే టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుంది సరే. లేనిపోని మాటలెందుకు..ఒద్దనుకుంది..ఊరుకుంటే సరిపోయేది కదా!
అలా కాకుండా, ప్రభాస్ ని ఉద్దేశించి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద నా మార్కెట్ ఎక్కువగా ఉంది..ఆ హీరో కంటే. ఆయనకిస్తున్న రెమ్యునరేషన్ ఎంతో నాకు తెలుసు...నాకూ సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వండి అని దర్శక నిర్మాతలతో చర్చలు జరిపి కుదరకపోయేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చేసింది. ఇంతవరకూ బాగానే ఉన్నా..పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కి ఉన్న మార్కెట్ ఏంటో తెలిసి కూడా తక్కువ చేసి మాట్లాడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు.
ప్రభాస్ అంటే ఇలాంటివన్నీ పట్టించుకోడు. కానీ, డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకోరు కదా..అందుకే, స్పిరిట్ సినిమాకి మీకు ఎంత కావాలో అంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని ప్రభాస్ రేంజ్ నీ అంత లేదని మాట్లాడావు. మరి, రాకా సినిమాకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు..నీకంటే అల్లు అర్జున్ మార్కెట్ గానీ, రేంజ్ గానీ తక్కువా? అంటే ప్రభాస్ కంటే కూడా తక్కువనేగా అర్థం..
అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ రాకా మూవీకి మీరు తీసుకుంటున్నారా? ఇలాంటి ఘాటైన ప్రశ్నలే ఇప్పుడు, దీపికను అడుగుతున్నారు. ఇదే కాదు, మిగతా సినిమాలకి తమరు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో..అని సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఇలాంటి, డిస్కర్షన్ పెట్టింది కాబట్టే కల్కి 2లో ఉండాల్సిన దీపిక ప్రాజెక్ట్ నుంచి తీసి పడేశారు. లేదంటే, అక్కడ స్పిరిట్..ఇక్కడ కల్కీ 2లో ఉండాల్సింది. ఏదేమైనా దీపిక మాత్రం ప్రభాస్‌ను చాలా చులకనగా, తక్కువ చేసి మాట్లాడింది. మరి, ఈ విషయం అల్లు అర్జున్‌కి తెలియదా? మన టాలీవుడ్ హీరోను అంటే ఎలా ఊరుకున్నాడు..ఇది కూడా ఇప్పుడు చర్చలో వినిపిస్తోంది.












