తెలంగాణ

Singer Mangli: సంచలనంగా మారిన మంగ్లీ విదేశీ ప్రయాణం.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?..

రచన: Venu6 నిమిషాల పఠనం

సుమారు రూ.10 కోట్ల మైక్రో ఫైనాన్స్ ఆర్థిక మోసం వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సినిమా ఫైనాన్స్‌తో పాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి, దాదాపు 100 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు ఈ వివాదానికి కేంద్రంగా మారాయి.

ఒకప్పుడు తాండలో జానపద పాటలు పాడే స్థాయి నుంచి స్టార్ సింగర్‌గా ఎదిగిన మంగ్లీ.. 2013లో టెలివిజన్‌లోకి అడుగుపెట్టి.. 'మాటకారి మంగ్లీ', 'తీన్మార్' వంటి కార్యక్రమాలతో తెలంగాణ ప్రేక్షకులకు చేరువయ్యారు. బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. జానపద పాటలతో అలరించారు. ఆ తర్వాత 2018లో వచ్చిన శైలజారెడ్డి అల్లుడు మూవీలో 'శైలజారెడ్డి అల్లుడు చూడే' పాటతో సినీ గాయనిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.. స్టార్ సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

కానీ ఆ అభిమానాన్ని తాకట్టుపెట్టి నమ్ముకున్నవారికి టోకరా ఇచ్చారనే ఆరోపణలతో తన గుర్తింపునకు మచ్చ తెచ్చుకున్నారు.. దీనికి కారణం ఫైనాన్స్ వివాదం.. ఇక మైక్రో ఫైనాన్స్, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేరుతో సామాన్య ప్రజల నుంచి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారి నుంచి కోట్ల రూపాయలు మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్‌ వసూలు చేశారని కథనాలు వెలువడ్డాయి.

సుమారు రూ.10 కోట్ల మైక్రో ఫైనాన్స్ ఆర్థిక మోసం వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సినిమా ఫైనాన్స్‌తో పాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి, దాదాపు 100 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు ఈ వివాదానికి కేంద్రంగా మారాయి. ఇక అప్పటి నుండి ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఇక తాజాగా ఈ కేసులో తాను మంగ్లీతో రాజీ పడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని అడ్వకేట్ సుబ్బు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఒక వీడియో ద్వారా పలు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ కేసు నుంచి వెనక్కి తగ్గడానికి మంగ్లీ వర్గీయుల నుంచి రూ.కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ తాను తిరస్కరించానని, ఈ విషయాన్ని ముందే ప్రజలకు స్పష్టం చేశానని తెలిపారు.

మరోవైపు న్యాయస్థానాల్లో ఇరుపక్షాల కేసులు ఇంకా కొనసాగుతుండగా, తీవ్ర అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అమెరికాలోని NRI తెలుగు సంఘాలు అంతర్జాతీయ వేదికలపై ఎలా అవకాశాలు ఇస్తాయని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో నిజానిజాలు తేలే వరకు మంగ్లీకి విదేశీ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చే అవకాశం ఇవ్వకూడదని కోరుతూ ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.

ఈ కేసులో పోలీసులు తమను ఊరు దాటి వెళ్లవద్దని ఆంక్షలు విధిస్తుంటే, మరోవైపు నిందితురాలిగా ఉన్న మంగ్లీ దేశం దాటి విదేశాలకు ఎలా వెళ్తోందని సుబ్బు నిలదీశారు. ఇప్పటివరకు ఆమెను అరెస్ట్ కాకుండా వెనుకుండి కాపాడుతున్న ఆ కేంద్ర మంత్రి ఎవరనేది ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ కేసులో కీలక సాక్షి అయిన డ్రైవర్ ఏమయ్యాడని ప్రశ్నించారు..

అలాగే ఎవరి నుండి ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని అడ్వకేట్ సుబ్బు స్పష్టం చేశారు. అయితే, ఈ కేసులో మోసపోయిన బాధితుల ఆవేదన మాత్రం వర్ణనాతీతంగా ఉంది. తమ డబ్బులు తిరిగి వస్తాయా? తమకు న్యాయం జరుగుతుందా? అనే ఆందోళనలో బాధితులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుంది? నష్టపోయిన బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అనే ప్రశ్నలకు మాత్రం ప్రస్తుతానికి సమాధానం లేకుండా పోయింది.

#Telangana#Singer Mangli#Advocate Subbu#Micro Finance#USA Events#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి