తెలంగాణ

సామాన్యుడికి ధరల షాక్.. ఆకాశాన్నంటుతున్న కూరగాయలు!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

బతుకమ్మ, దసరా పండుగల వేళ తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్‌నినో (El Nino) ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల దిగుబడి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్‌లో ధరలకు రెక్కలొచ్చాయి.

 బతుకమ్మ, దసరా పండుగల వేళ తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్‌నినో (El Nino) ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల దిగుబడి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్‌లో ధరలకు రెక్కలొచ్చాయి.

 గతంతో పోలిస్తే ప్రతీ కూరగాయల ధర అమాంతం పెరగడంతో పాటు, కిలో ఉల్లిపాయల ధర రూ.55నుంచి రూ.70వరకు పెరగడంతో వంటింటి బడ్జెట్‌ను పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రైతుబజార్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూరగాయల తాజా ధరలను పరిశీలిస్తే.. టమాట కిలో రూ.40, బంగాళదుంప రూ.45, పచ్చిమిర్చి రూ.50-52, బెండకాయ రూ.40-60, క్యాప్సికం రూ.60-68, ఉల్లిగడ్డ కిలో రూ.55వరకు విక్రయిస్తున్నారు.

 ఇక విజయవాడలోని రైతుబజార్లు, బహిరంగ మార్కెట్లలోనూ ఇదే రకమైన ధరల మంట కనిపిస్తోంది. బెంగుళూరు టమాట కిలో రూ.40-45, బీన్స్ రూ.95 నుంచి ఏకంగా రూ.300వరకు (రకాన్ని బట్టి), క్యారెట్ రూ.48-65, అల్లం, వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలతో పాటు బియ్యం (జైశ్రీరామ్ బియ్యం క్వింటాల్ రూ.9,500కు), కందిపప్పు, పెసరపప్పు, చక్కెర వంటి నిత్యావసరాల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోవడం గమనార్హం.

 వర్షాలు లేకపోవడం, జలాశయాలు అడుగంటిపోవడం వల్ల వ్యవసాయ రంగం దెబ్బతినడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పండుగ సమయంలో పిల్లాపాపలతో సంతోషంగా గడపాల్సిన సమయంలో, విపరీతంగా పెరిగిన ధరలు తమను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని గృహిణులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ నిల్వలను అరికట్టాలని, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

#VegetablePrices2026#ElNinoImpact#HyderabadMarketRates#VijayawadaVegetables#DasaraPriceHike#TeluguNewsBusiness#InflationInTelangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి