టాప్ న్యూస్

TG : రేవంత్ సర్కారులో ‘కమీషన్ల’ లొల్లి.. మంత్రుల గుర్రు!

రచన: Kumar••8 నిమిషాల పఠనం

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారుపై భారీగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పిలిచే ప్రతి టెండర్‌లో కమీషన్ బేసిస్ ఆధారంగానే ఖరారు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు, మంత్రులు సైతం ఇదే విషయంపై చర్చించుకుంటున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారుపై భారీగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పిలిచే ప్రతి టెండర్‌లో కమీషన్ బేసిస్ ఆధారంగానే ఖరారు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు, మంత్రులు సైతం ఇదే విషయంపై చర్చించుకుంటున్నట్టు సమాచారం.సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే కొందరు అధికారులు ఈ వ్యవహారాన్ని అత్యంత చాకచక్యంగా డీల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాంట్రాక్టర్లు సైతం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే, తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు మంత్రులు ఫీల్ అవుతున్నట్టు సమాచారం.

నాడు డిప్యూటీ సీఎం భట్టి మ్యాటర్‌లో..

రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క శాఖలోనూ పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. గత బీఆర్ఎస్ హయాంలో బిల్లులు రాక చాలా మంది కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం మారాక తమకు బిల్లులు వస్తాయని ఎంతో ఆశపడ్డారు. తమ కష్టాలు అన్ని తీరిపోయాయని సంబురపడ్డారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ చూస్తున్న భట్టి విక్రమార్క మీద సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి.ప్రభుత్వం నుంచి టెండర్లు దక్కించుకుని సొంత ఖర్చులతో పనులు పూర్తి చేసి రూ. కోట్లల్లో పెరుకుపోయిన బిల్లులు చెల్లించాలని కోరగా..10 నుంచి 15 శాతం కమీషన్ ఎవరు ఇస్తే వారికే ముందు బిల్లులు విడుదల చేస్తామని అన్నారని కాంట్రాక్టర్లు గతంలోనే ఆరోపణలు చేశారు. ఇందులో భట్టి విక్రమార్క నేరుగా ఇన్వాల్వ్ కాలేదని, ఆయన సతీమణిని కమీషన్లు తీసుకుని బిల్లులు విడుదల చేయించేవారని పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి.

నేడు సీఎంవో మీద..

ప్రస్తుతం సీఎంవో కార్యాలయం మీద పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సీఎంకు దగ్గరగా ఉండే అధికారులు పెద్దఎత్తున కమీషన్ బేసిస్ మీద లావాదేవీలు నడిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. దానికి ఊతమిస్తూ నిన్న ఆర్‌వీఎమ్ కన్‌స్ట్రక్షన్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నామా రమేష్ మీడియా ముఖంగా సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో రేడియల్ రోడ్డు-2 టెండర్ల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తమను బెదిరించిందని ఆరోపించారు.తనకు టెండర్లు కేటాయించడానికి సీఎంవో 15 శాతం కమీషన్ డిమాండ్ చేసిందని ఆరోపించారు.

తక్కువ బిడ్ దాఖలు చేసినప్పటికీ తమ సంస్థను ఉద్దేశపూర్వకంగానే డిస్క్వాలిఫై చేశారని, ప్రభుత్వం ముందే అనుకున్న ఇతర కంపెనీలకు కాంట్రాక్టు దక్కేలా చేశారన్నారు. అంతేకాకుండా, టెండర్లలో పాల్గొనకుండా కొందరు కాంట్రాక్టర్లను సీఎంవో అధికారులు బెదిరించారని ఆరోపించారు. కాగా, ఈ ఆరోపణలపై సీఎంవో కార్యాలయం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

శాఖల్లో సీఎంవో జోక్యం.. మంత్రుల గుర్రు..

సీఎంవో వ్యవహారంపై రాష్ట్ర మంత్రులు సైతం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ శాఖల్లో సీఎంవో జోక్యం పెరిగిపోతుందని మంత్రులు ఎప్పటినుంచో అసహనంతో ఉన్నట్టు తెలిసింది. ఇటీవలి కాలంలో ఇది మరింత ముదిరినట్టు సమాచారం.గతంలో కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలో తన శాఖలో ఓ మంత్రి, సీఎంవో జోక్యంపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు.ఇప్పుడు సీఎంవో జోక్యంపై కొందరు మంత్రులు బయటకు చెప్పుకోలేక పోయినా పార్టీ పెద్దలు, తోటి మంత్రుల వద్ద ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సంబంధిత శాఖ మంత్రులు లేకుండానే గతంలో సీఎం పలుమార్లు సమీక్ష నిర్వహించడంపైనా పలువురు అమాత్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీలో ప్రచారం జరిగింది.తమ శాఖల్లో సీఎంవో జోక్యం పెరగడంపై మంత్రులు ఇప్పటికీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

అగ్నికి ఆజ్యం పోసిన గురుకుల టెండర్లు..

తాజాగా గురుకుల టెండర్లలో కమీషన్ల పంచాయితీ నెలకొన్నట్టు తెలుస్తోంది. దీంతో సీఎంవోపై మంత్రుల గుర్రుగా ఉన్నట్టు సమాచారం. సీఎంవో జోక్యంపై సంక్షేమశాఖల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.2,000 కోట్ల టెండర్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడం, టెండర్ల ప్రక్రియలో తమను పక్కన పెట్టారంటూ మంత్రుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.

TG : రేవంత్ సర్కారులో ‘కమీషన్ల’ లొల్లి.. మంత్రుల గుర్రు!

కమీషన్ల వ్యవహారమే వివాదానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.బుక్స్‌, స్టేషనరీకి రూ.1,200 కోట్లు, కిరాణా సరుకులకు రూ.800 కోట్ల వర్క్‌ ఆర్డర్లు ఇవ్వగా.. అధిక ధరలకు గుజరాత్‌ కంపెనీలు, అనుయాయులకు టెండర్లు కట్టబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి.టెండర్ల వ్యవహారంలో సీఎంవో ఉన్నతాధికారి కీలక పాత్ర పోషించారంటూ చర్చ జరుగుతోంది. వర్క్‌ ఆర్డర్లు ఇచ్చి రెండు నెలలు గడిచినా పూర్తిస్థాయిలో సరుకుల సరఫరా జరగలేదని ఆరోపణలున్నాయి.

విద్యార్థులకు సరఫరా చేస్తున్న యూనిఫామ్స్‌, బూట్లు, సాక్సుల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుట్టుమిషన్లు, ఉపాధి శిక్షణ టెండర్లపైనా వివాదం నెలకొంది. శాఖల వ్యవహారాల్లో సీఎంవో జోక్యంపై మంత్రుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.కాగా, ఈ గురుకుల టెండర్లలో అవకతవకలు జరిగాయని ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించిన విషయం తెలిసిందే. గతంలో బ్యాన్ చేసిన సంస్థకు కాంట్రాక్టులు ఎలా కట్టబెట్టారంటూ ఆయన రేవంత్ సర్కారు మీద తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు.

#cm revanth reddy#congress#telangana#commision#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి