National

National : నాపై నిఘా పెట్టారు.. అరెస్టు చేస్తే చేసుకోండి : దీప్కే

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతివాహనదారుడిని, పౌరుడిని భద్రతా బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పండుగల వేళ సీజేపీ నిరసన కారుల ముసుగులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు,భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతివాహనదారుడిని, పౌరుడిని భద్రతా బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పండుగల వేళ సీజేపీ నిరసన కారుల ముసుగులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు,భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. జంతర్ మంతర్ పరిసరాల్లోకి నిరసనకారులు ఎవరినీ అనుమతించడం లేదు. ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించిన మాదిరి దర్శనమిస్తోంది.

ఇదిలాఉండగా, జంతర్ మంతర్ బ్యాన్ చేయడంతో మరో చోట తిరంగా ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తాజాగా స్పందించారు.'లెహ్రా దో తిరంగా' మార్చ్‌కు ముందు భద్రతా బలగాలు భారీగా మోహరించాయని, ఆంక్షలు విధించారన్నారు. సెంట్రల్ పార్క్ మూసివేశారని చెప్పారు. అయినప్పటికీ తాను భయపడటం లేదని పేర్కొన్నారు. ఇక్కడే ఉన్నానని, కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.

అరెస్టులకు, ఆంక్షలకు బెదిరేదిలేదని దీప్కే స్పష్టంచేశారు. త్వరలో పోలీసులు తనను అదుపులోకి తీసుకోవచ్చని జోస్యం చెప్పారు.తన నివాసం వద్ద పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది నిఘా పెట్టారని తెలిపారు. కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌ను అక్టోబర్ 16, 17 తేదీలలో మూసివేస్తున్నట్లు ఎన్‌డీఎంసీ ప్రకటన చేసిందని గుర్తుచేశారు.ఓటర్ల జాబితా సవరణ అవకతవకలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చామని, సెంట్రల్ పార్క్ వద్దకు వచ్చి జాతీయ జెండా ఎగురవేయాలని తన మద్దతుదారులకు సీజేపీ ఫౌండర్ పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు తనను అనుసరిస్తున్నాయని, పోలీసుల అరెస్టులకు తాము భయపడబోమని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించి, స్వతంత్ర వ్యక్తిని సీఈసీగా నియమించాలని దీప్కే డిమాండ్ చేశారు.కాగా, దసరా పండుగ సమయంలో తమ వ్యాపారాలు దెబ్బతినకుండా ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు అనుమతులు ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులకు స్థానిక వ్యాపారులు విజ్ఞప్తి చేయడం గమనార్హం.

#CJP#national#Abijith#delhi#protests#CEC gnanesh kumar#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి