ఏపీ

AP : ఏపీ ‘లోకల్’ హీట్..టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహీ

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపార్టీలు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి అధికార కూటమి పార్టీని దెబ్బకొట్టాలని ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపార్టీలు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి అధికార కూటమి పార్టీని దెబ్బకొట్టాలని ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అదే దూకుడుతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే బిజీలో ఉన్నారు.

ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పుంగనూరులో నామినేషన్ వేసే అభ్యర్థులతో కలిసి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎలక్షన్ కేంద్రానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. దీంతో మిథున్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొంతమందికి గాయాలయ్యాయి.

ఈ దాడిలో టీడీపీ కార్యకర్త మధు రాయల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వైసీపీ నాయకులు నామినేషన్ వేయకుండా అడ్డుకునే క్రమంలోనే ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణ కారణంగా స్థానికంగా తీవ్ర ఉద్రిత్త వాతావరణం నెలకొంది. గత స్థానిక ఎన్నికల్లో సైతం పుంగనూరులో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఘర్షణతో వాతావరణంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. నామినేషన్లు వేయకుండా తమకు అడ్డుకునేందుకే కాన్వాయ్ పై దాడి చేశారని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఇదిలాఉండగా, ఈ ఘటనపై కూటమి సర్కార్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఘర్షణ వాతావరణం నెలకొనడానికి బాధ్యులను గుర్తించి వారి మీద కేసులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం.వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అధికార టీడీపీ నాయకులు,శ్రేణులు ఆరోపించారు. ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడంతో ప్రస్తుతం నామినేషన్ కేంద్రం వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#TDP#YSRCP#nominations#local body elections#fighting#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి