తెలంగాణ

TG : డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తిచేయండి : మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి

రచన: Kumar••4 నిమిషాల పఠనం

డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకేసారి లేఖలు రాశారు.

డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకేసారి లేఖలు రాశారు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానుసారం ఎదుల జలాశయం నుంచి డిండి ఎత్తిపోతల కోసం హెడ్ వర్క్స్ చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్బంగా లేఖలో కోరారు.

దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం డిండి లిఫ్ట్ స్కీమ్ సర్వేలకు 2007లో అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిండి ఎత్తిపోతల పథకం కోసం శ్రీశైలం జలాశయం నీటిని తీసుకునేందుకు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకంతో అనుసంధానం చేసిందన్నారు. 90 టీఎంసీలు పాలమూరు–రంగారెడ్డికి, 30 టీఎంసీలు డిండి ఎత్తిపోతల పథకానికి అని నిర్ధారించిందని గుర్తుచేశారు. కానీ, డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తీసుకోవడానికి అవసరమైన నిర్మాణం జరగలేదన్నారు.

TG : డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తిచేయండి : మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి

2024లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుల జలాశయం నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తీసుకోవాలని కేబినెట్‌లో నిర్ణయించి, హెడ్ వర్క్స్‌కు రూ.1800 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తున్నట్లు టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు చేసిందన్నారు. కానీ, ఇప్పటివరకు భూసేకరణ జరగనందున పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. మునుగోడు, దేవరకొండ ప్రాంత భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉన్నందున ఆ ప్రాంతాల జలాలతో పాటు పంట పొలాలు, పండించిన ఆహార ధాన్యాలు కూడా కలుషితమై ప్రజలు తరతరాలుగా ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు.

TG : డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తిచేయండి : మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి

ఈ తరుణంలో రక్షిత సాగునీరు అందించడం డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు.కావున భూసేకరణ జరిపించినట్లయితే హెడ్ వర్క్స్ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని, ఆ ప్రాంత ప్రజల దయనీయ పరిస్థితిని గమనించి మానవీయ కోణంతో ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చి, త్వరగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే లేఖలో విజ్ఞప్తి చేశారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలకు రక్షిత సాగునీరు అందడం ద్వారా ఫ్లోరోసిస్, క్రానిక్ పీడిత ప్రజలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కావున ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

#former mla narsimhareddy#Cm revanth#uttamkumar reddy#Congress#letter#dindi project#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి