టాప్ న్యూస్

TG & AP : తెలంగాణలో 235.. ఏపీలో 388 కరువు మండలాలు

రచన: Kumar••5 నిమిషాల పఠనం

ఎన్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కరువుపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కరువుపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ వానాకాలంలో దాదాపు 17శాతం లోటు వర్షపాతం నమోదైందని ప్రకటించారు. దీంతో దాదాపు 235 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. రైతు సంఘాలతో పాటు వివిధ రంగాల నిపుణులతో భేటీలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని ఎల్‌నినో పరిస్థితులు.. చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సలహాలు సూచనలు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.కరువు మండలాల ప్రకటనతో రాష్ట్రానికి తగిన సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత కూడా ప్రత్యేక కేబినెట్ భేటీ ఉంటుందన్నారు.

అయితే, వర్షాభావపరిస్థితుల కారణంగా ఏపీలోనూ తీవ్ర కరువు ఏర్పడినట్టు సమాచారం. రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలో మొత్తం 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 283 మండలాలు తీవ్ర కరువు ప్రాంతాలుగా, మరో 105 మండలాలను మధ్యస్త కరువు మండలాలుగా వర్గీకరించింది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి (ఎఫ్‌ఏసీ)జి.సాయిప్రసాద్ ఈ మేరకు గెజిట్ ఉత్తర్వులు విడుదల చేశారు.

రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని విజయనగరం, అనకాపల్లి జిల్లాలో కరువు తీవ్రత అత్యధికంగా ఉంది. సాధారణంగా కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఖరీఫ్ కరువును అక్టోబర్ 31 నాటికి ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. జూన్ నుంచి ఆగస్టు వరకు ఏకంగా 53.4 శాతం వర్షపాత లోటు నమోదు కావడం, ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండడంతో కరువు నిర్ధారణ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం ముందస్తుగానే ఈ ప్రకటన చేసింది.

కలెక్టర్ల ప్రతిపాదనలపై సెప్టెంబర్ 30న ఏపీ అధికారులు వర్చువల్‌‌గా సమీక్షించారు. అనంతరం పలు జిల్లాల్లోని మండలాలను కరువు ప్రాంతాలుగా నిర్దారించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని మండలాలకు ఇందులో చోటు కల్పించారు. జిల్లాల కలెక్టర్లు వెంటనే కరువు ప్రాంతాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. దీనిద్వారా రైతులకు పంట నష్టపరిహారం, పంట రుణాల రీషెడ్యూల్, బీమా క్లెయిమ్‌లు అందేలా చూడటంతో పాటు ఉపాధి హామీ పనుల పెంపు, తాగునీరు, పశుగ్రాసం సరఫరా వంటి చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.

#drought mandals#ap and telangana#Elnino#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి