క్రైమ్

Crime : స్కెచ్ వేసి లేపేశారు.. అడ్డంగా దొరికిపోయిన ప్రియుడు, ప్రియురాలు..!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

వివాహేతర సంబంధాలు కుటుంబాలను ముక్కలు చేస్తున్నాయి. ప్రియుడి కోసం కట్టుకున్న వాడిని కడతేరుస్తున్న ఘటనలు అనేకంగా వెలుగుచూస్తున్నాయి.ఇటీవలి కాలంలో ఇటువంటి నేరాలు గణనీయంగా పెరుగుతుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివాహేతర సంబంధాలు కుటుంబాలను ముక్కలు చేస్తున్నాయి. ప్రియుడి కోసం కట్టుకున్న వాడిని కడతేరుస్తున్న ఘటనలు అనేకంగా వెలుగుచూస్తున్నాయి.ఇటీవలి కాలంలో ఇటువంటి నేరాలు గణనీయంగా పెరుగుతుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పురుషులు భయాందోళనకు గురవుతున్నారు. ఇష్టం లేకపోతే నచ్చినవాడితో వెళ్లిపోవాలని కానీ, ఇలాంటి చంపడం ఏంటని సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తను హతమార్చింది ఓ భార్య. మద్యంలో పురుగుల మందు కలిపి తాగించి హత్య చేయడంతో పాటు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో హత్యోదంతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకివెళితే.. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన సుమలతకు పదేళ్ల కిందట గొల్లపల్లికి చెందిన పెండల సంపత్(32)అనే వ్యక్తి విహహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్లంబర్ పనులు చేసే సంపత్ అత్తగారింట్లోనే ఉండేవాడు.

ఈ క్రమంలోనే బుద్దారం గ్రామంలో ఉండే ఉమ్మల శ్రీకాంత్ అనే వ్యక్తితో సుమలత వివాహేతర సంబంధం పెట్టుకుంది. అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపాలని నిర్ణయించుంది.తమకు సహకరిస్తే రూ.లక్ష ఇస్తామని చెప్పి తరుణ్ అనే వ్యక్తితో సుమలత,శ్రీకాంత్ ఒప్పందం కుదుర్చుకున్నారు.అతని సహకారంతో ఈ నెల 17వ తేదీన సంపత్‌ను మద్యం తాగేందుకు శ్రీకాంత్ పిలిపించాడు. ఊరిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానంలో పురుగుల మందు కలిపిన మద్యం తాగించి సంపత్ మరణించాక మృతదేహాన్ని బండి మీద తరుణ్, శ్రీకాంత్ ఇంటికి తీసుకెళ్లారు.

మృతదేహం చుట్టూ పురుగుల మందు చల్లి, తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని సంపత్ కుటుంబ సభ్యులను, గ్రామస్తులను సుమలత నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు సైతం ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం పూర్తి చేశారు. అయితే, తన కొడుకుది ముమ్మాటికీ హత్యేనని సంపత్ తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దీంతో భయపడిన సుమలత, శ్రీకాంత్ పెద్దల సమక్షంలో నేరాన్ని అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

#extramarrital affair#bhupalapally#wife lover#killed#husband#swechaaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి