స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

swechaanews monthly report: స్వేచ్ఛ న్యూస్ మంత్లీ రిపోర్ట్!

రచన: Swechaanews Chairman••12 నిమిషాల పఠనం

సామాజిక పారదర్శకత, అవినీతి నిర్మూలనే ప్రాథమిక ధ్యేయంగా ముందుకు సాగుతున్న డిజిటల్ వార్తా సంస్థ 'స్వేచ్ఛ న్యూస్' సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్టిగేటివ్ కథనాల సమగ్ర నివేదిక అందిస్తోంది. ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల సారథ్యంలో సామాన్యుల సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వ వైఫల్యాలు, భూమాఫియా అక్రమాలను ఎండగట్టడంలో స్వేచ్ఛ న్యూస్ ట్రెండ్ సెట్టర్‌‌గా నిలిచింది.

  • ఎక్స్లూజివ్ కథనాలన్ని ఒకే చోట!

  • నెలవారిగా అప్డెట్ స్టోరీలు..

  • అక్రమాలపై అవినీతి పై ఎప్పటికప్పుడు ఎండకట్టే కథనాలు

సామాజిక పారదర్శకత, అవినీతి నిర్మూలనే ప్రాథమిక ధ్యేయంగా ముందుకు సాగుతున్న డిజిటల్ వార్తా సంస్థ 'స్వేచ్ఛ న్యూస్' సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్టిగేటివ్ కథనాల సమగ్ర నివేదిక అందిస్తోంది. ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల సారథ్యంలో సామాన్యుల సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వ వైఫల్యాలు, భూమాఫియా అక్రమాలను ఎండగట్టడంలో స్వేచ్ఛ న్యూస్ ట్రెండ్ సెట్టర్‌‌గా నిలిచింది.

రాజకీయం, రెవెన్యూ, రియల్ ఎస్టేట్, పరిపాలనా విభాగాల్లో జరుగుతున్న పలు భారీ కుంభకోణాలను చట్టబద్ధమైన ఆధారాలు, కోర్టు తీర్పుల ప్రతులతో సహా వెలుగులోకి తెచ్చి ప్రజాక్షేత్రంలో భారీ సంచలనం సృష్టిస్తోంది. 'Swechaanews.com' పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తా కథనాలు, ఇ-పేపర్, లఘు వార్తలను అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత పదునైన శైలిలో వార్తలను అందించేందుకు మా టీమ్ కృషి చేస్తుంది.

సెప్టెంబర్ కథనాలు https://swechaanews.com/epaper/103

1. రైజింగ్ పేరుతో చెప్పింది ఏంటీ చేస్తుంది ఏంటని గుంపు మేస్త్రీకి మాటలే ఎక్కువ అని పార్ట్ -2 గా వ్రాశాం.

2. 22(ఏ) పై స్వేచ్ఛ న్యూస్ ఎన్నో అధారాలు సేకరించింది. ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేసేలా అధారాలతో వార్తలు ఇచ్చాం. దీంతో పొలిటికల్ వార్ మొదలయిందని 2వ తేదిన ఇచ్చాం.

3. సురేఖ పై రేవంత్ మార్క్ పిర్యాదు అని తొలగింపు అనివార్యమని అందరికంటే ముందే చెప్పాం.

4. 4 న కొండ సురేఖకు సింపతి లేదని 23 ఏండ్లుగా అమె తీరే నిదర్శనం అని నిజాలు చెప్పే ప్రయత్నం చేశాం.

5. 5న మా భూమి మీకేందుకని భూ చట్టాలు 1909 నుంచి ఎలా మారాయి. పోరాడాతే ఎలాంటి మార్పులు వచ్చాయో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చరిత్ర చెప్పక ముందే పోరాడితేనే ప్రభుత్వాలు దిగోస్తాయని ఉదహారాలతో వార్తలు ఇచ్చాం.

swechaanews monthly report: స్వేచ్ఛ న్యూస్ మంత్లీ రిపోర్ట్!

6. అసెంబ్లీకి అన్ని పార్టీలు ప్రజల్లోకి ఎలా వెళ్లాయో వాటి తీరుతెన్నులను ప్రస్తావించాం.

7. అమ్మిన భూమి అమ్మకం జరిపి బాచుపల్లిలో దందాలు చేసిన అట్లూరి సుబ్బారావు అండ్ టీం పై అధారాలు ముందు ఉంచాం.

8. రెవెన్యూ డెన్ లక్ష్యం 2 లక్షల కోట్లని ఆ మంత్రి టార్గెట్ ఎంటో ? 22(ఏ) పేరుతో ఏర వేశారని , మిగితా సెటిల్మెంట్ల పై డేర్ గా వ్రాశాం.

9. కాసాని అండ్ సన్స్ గ్యాంగ్ పేరుతో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా డైరెక్టర్ తండ్రి చేసిన కబ్జాలు ఎలా ఉన్నాయో మరో కథనం ఇచ్చాం.

10. సభ విలువ తెలియని సన్నాసుల్లారా అంటూ ప్రతిపక్షలను కూడా కడిగిపారేశాం. మా సమస్యలు ఎప్పుడు చర్చిస్తారు. అందరు దొచుకోవడానికే వచ్చారు. మీ అవినీతి పై ఎప్పుడు ప్రజలకు తెలుస్తుందని నిక్కస్సుగా వివరించాం.

swechaanews monthly report: స్వేచ్ఛ న్యూస్ మంత్లీ రిపోర్ట్!

11. 13 న 22ఏ పై సర్కారు దిగొచ్చాల్సిన పరిస్థితి పై స్వేచ్ఛ న్యూస్ ఎఫర్ట్స్ ఎలా చేసేందో చెప్పాం., నెల రోజుల్లో ఈ సమస్యల పై ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో స్వేచ్ఛ న్యూస్ బై దేవేందర్ రెడ్డి చిన్న ఈ పేపర్ చేసి చూపించింది. 22ఏ ను అసెంబ్లీలో చర్చ వరకు ఎలా తీసుకొచ్చింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ దందాలు పై అంచనా వేయడంలో సక్సెస్ అయ్యాం . ఎంతో మందికి కలిసి సబెక్ట్ వివరించి, అధారాలు ఇచ్చి ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు చేరవేశాం.

12. 16న సరైన చర్చకు సర్కార్ రేడి అంటూ అసెంబ్లీ లో జరగబోయేది ముందే వ్రాశాం.

13. 17 వ తేదిన సీఎం అసెంబ్లీలో మాట్లాడిన, స్కామ్ లన్నింటిని గత 5 ఏండ్లుగా దేవేందర్ రెడ్డి చింతకుంట్ల భయటపెట్టినవే అంటూ ఆనాటి పేపర్స్ కట్టింగ్స్ తో పాటు ఇచ్చిన వార్తలు సంచలనం రేకేత్తించాయి. లక్షల కోట్లు దొచుకునే ప్రభుత్వాలకు హైదరాబాద్ భూములే అధారం కావడంతో భూ స్కాంలను వెలిక్కి తీసేది.. ఆ వార్తలు అధారాలతో , కోర్టు తీర్పులతో వ్రాసేది ట్రెండ్ సెట్టర్ గా సెల్ప్ మోటివేషన్ గా వార్తలు ఇచ్చాం.

14. 18న గుంటుర్ మస్తాన్ మరో కబ్జా అంటూ ఆరా మస్తాన్ అధికారులను పట్టుకుని హైదరాబాద్ లో చేస్తున్న కబ్జాల పై స్టోరీ ఇచ్చాం .

15. ఫామ్ హౌజ్ ల పై కాంగ్రెస్ పార్టీ రాద్దాంతాన్ని మరో కోణంలో చూపించాం. డైవర్ట్ పాలిటిక్స్ లో రేవంత్ ను మించిన వారు లేరని, ఈ పాచిపోయిన ఫామ్ హౌజులతో ప్రజలకు ఒరిగేది ఏమి లేదని ఎండగట్టాం. ఏనాడు భూముల పై ప్రభుత్వం వేసిన కమిటీలు సరిగ్గా పనిచేయలేదు. చేసినా ఏ ప్రభుత్వం సరైనా చర్యలు తీసుకోలేదని ఆస్టోరీ సారంశం. పాలకుల పై భూ ఫైటింగ్ చేయాలని పార్ట్ -1

swechaanews monthly report: స్వేచ్ఛ న్యూస్ మంత్లీ రిపోర్ట్!

16. 21 న తాండురు ఎమ్మెల్యే కబ్జాలను ఎలా వదులుతున్నారని అక్కడ పేదలకు న్యాయం చేస్తారా ? 50 ఎకరాల కబ్జా పై ఏం చేశారో ఇచ్చాం.

17. ఎల్ నినో తో తెలంగాణ గొంతు ఎండుతుంది. పొతిరెడ్డి పాడు నుంచి నీళ్లు మాయం అవుతున్నాయి. దొంగ లెక్కలతో తెలంగాణను మోసం చేస్తున్నారని తెలిపాం. రోజు రోజుకు రాబోయే నీటి కష్టాల పై వివరించాం.

18. 22న ఓ లేడి బిజినెస్ మేన్ పోస్టింగ్ కలకలం రేపితే అసలు అవుట్ డోర్ మీడియా ఆగడాలు ఎలా ఉంటాయి. వాళ్లు ఏటా 350 కోట్ల టాక్స్ ప్రభుత్వానికి కట్టడం లేదు. అనాధికారికంగా బోర్డులు వేసుకొని ఆ మాఫియా వేల కోట్లకు పరుగెత్తింది. అయినా ఏదో కేసులు వేసుకుంటు వాళ్ల చేసే దందా పై ఇన్వెస్టిగేషన్ కథనాలు ఇచ్చాం.

19. 23న పోలీస్ వ్యవస్థకు సుస్తీ చేస్తుంది. లంచాలతో ప్రజలు విసిగెత్తి పోతున్నారు. ఏసిపి, అడిషనల్ డీసీపీల పర్యవేక్షణ కరువయింది. అంటూ రోజు రోజుకు పోలీస్ స్టేషన్స్ లో దిగజారుతున్న పరిస్థితి పై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం.

20. బీఆర్ఎస్ నేతల ఇళ్ల టూర్ల పై కాంగ్రెస్ సోషల్ మీడియా గగ్గోలు ఏంటో ? దానితో ప్రజలకు ఒరిగేది ఎంటీ ? మీరు ప్రైవేట్ అస్తుల పై బ్లేమ్ చేయగలరు తప్పా ? వాటిని స్వాధీనం చేసుకుంటారా ? అక్రమాల పై సెటిల్మెంట్స్ తప్పా మరేమి లేదని వ్రాశాం. ఇందులో పాలకుల పై భూ ఫైటింగ్ పార్ట్ -2

swechaanews monthly report: స్వేచ్ఛ న్యూస్ మంత్లీ రిపోర్ట్!

21. 25న అన్ని కేసుల్లో సెటిల్మెంట్స్ తో రేవంత్ రవ్వంత కంటే ఎక్కువే తగ్గుతున్నారని ? మైక్ లో గాండ్రింపులు ? మెట్టు దిగి అన్నింట్లో అర్ధిక లాభాలు పొందుతున్న తీరు, ఆ కేసులు ఎంటో ప్రజల ముందు ఉంచాం.

22. 26న ఇజం లేని టూరిజం. పాలసీ 2025-30 ని ఒక్క మెఘా కృష్ణారెడ్డికే మేలు జరిగిందని ఇన్వెస్టిగేషన్ కథనం ఇచ్చాం. వరల్డ్ టూరిజం డే సందర్భంగా మాటలేనా , చేతలు ఉండవా అంటూ టూరిజం పై అధికారుల నిర్లక్ష్యం ఎంటి 10 కోట్లతో టూర్స్ తో ఒరిగింది ఏంటని ఇచ్చాం.

23. కొంగర్ ఖుర్ద్ లో వక్ఫ్ బోర్డు 600 ఎకరాలంటూ చేస్తున్న భూ దందా పై 3 ఏండ్ల క్రితం వ్రాసిన కథనాలనే ఇప్పుడు నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్స్ వ్రాశాయి. అప్పుడే మేలుకుంటే ఈ సమస్య వచ్చేది కాదని ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల ఫేక్ ఓఆర్సీలతో ఎం చేశారు. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ఎలా రైతుల వద్ద నుంచి కొట్టేయాలని చూస్తున్నారో తెలంగాణ ప్రజల ముందు మరో భారీ భూ స్కాం తీరు తెన్నులను వివరించాం.

24. 29న భాగ్యనగర్ సోసైటి భూములకు రెక్కలు అంటూ గ్రీన్ కో అనిల్ కుమార్ టీం సుప్రీం కోర్టు అర్డర్స్ ని తప్పుగా చూపించి రేకులు పాతుతున్న తీరును స్వేచ్ఛ న్యూస్ కోర్టు తీర్పుల అధారాలు, ప్రాక్టికల్ గా జరుగుతున్న తీరును వ్రాశాం. 240 ఎకరాలు ఏసియా ఖండంలోనే అత్యంత విలువైన భూములు, వివాదస్పదలు ఏంటో చెప్పాం.

swechaanews monthly report: స్వేచ్ఛ న్యూస్ మంత్లీ రిపోర్ట్!

ఇలా రోజు ఎన్నో ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ తో ప్రజల ముందుకు దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఛైర్మన్ గా స్వేచ్ఛ న్యూస్ మీ ముందుకు వస్తుంది.

షార్ట్ న్యూస్, ఈ పేపర్, ఎప్పటికప్పటి సమాచారం డిజిటల్ న్యూస్ స్టోరీలు. Swechaanews.com పేరుతో మీ ముందు ప్రజ సమస్యలే ఎజెండాగా , నాయకుల అక్రమాలు, అధికారుల అవినీతి భయట పెట్టేందుకు సామాన్యులకు అతి దగ్గరగా మీ ముందు మంత్లీ రిపోర్టు కూడా అందుబాటులో ఉంచుతున్నాం.

రాబోయో రోజుల్లో మీ అందరి సహాకారంతో మరింత మెరుగ్గా, చురుక్కుగా ఫైట్ చేస్తామని హామి ఇస్తున్నాం.

బై

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

#SwechaaNews#DevenderReddyChinthakuntla#SwechaaNewsExclusives#InvestigativeJournalism#TelanganaLandScam#22ASectionControversy#SwechaaNewsEpaper
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి