Vijayashanti: విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి దర్శకులు కొందరు అప్పటి హీరోయిన్స్‌ను మళ్ళీ టాలీవుడ్ సినిమాలలోకి అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి వారు..సీనియర్ నటీమణుల కోసం చక్కటి పాత్రలు..కథలో బలం ఉన్న పాత్రలను రాస్తున్నారు. మిర్చి సినిమాతో నదియా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తోంది.
ఎప్పుడో స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన ఖుష్బూ..మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్‌కి తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది. అయితే, ఈమె ఎక్కువగా సినిమాలను ఎప్పుకోవడం లేదు. కథలో ప్రాధాన్యత ఉంటేనే సైన్ చేస్తోంది. అలాగే, రమ్యకృష్ణ కూడా. బాహుబలి సినిమాతో వచ్చిన ఆదరణ అసాధారణం. హీరోయిన్‌గా నటించినప్పుడు కూడా ఈ రేంజ్‌లో పాపులారిటీ రాలేదు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి తర్వాత శివగామి అంటూ అందరూ పిలుచుకుంటున్నారు. అయితే, మళ్ళీ ఆ రేంజ్ పాత్ర రమ్యకృష్ణకి దక్కలేదు. లైగర్ లాంటి సినిమాలను చాలా తక్కువగా ఒప్పుకుంటోంది. ఈ సీనియర్ నటీమణులంటే భిన్నంగా ఉన్నారు విజయశాంతి. దాదాపు 13 ఏళ్ళ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి పట్టుపట్టి మరీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో రీ ఎంట్రీ చేశాడు.
ఈ మూవీ విజయశాంతికి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. అందరూ..ఇకనుంచి వరుసగా సినిమాలను ఒప్పుకుంటుందని భావించారు. కానీ, విజయశాంతి మాత్రం ఏ ఒక్క సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. డబ్బు కాదు ముఖ్యం..మళ్ళీ క్యారెక్టర్ అంటూ చేస్తే కొన్నేళ్ళు గుర్తుండి పోవాలి. అలాంటి, రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమధ్య నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమాలో నటించారు. ఈ సినిమా ఫ్లాపైంది. మళ్ళీ, కొంత గ్యాప్ తర్వాత కొరటాల శివ విజయశాంతికి కథ చెప్పినట్టుగా తెలుస్తోంది. అది, కూడా బాలయ్య నటించబోతున్న సినిమా. ఈ సినిమాలో విజయశాంతికి కీలకమైన పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై బాలయ్య-విజయశాంతిలది హిట్ పెయిర్. మరి, ఇప్పుడు ఎన్‌బికే 112 కోసం డేట్స్ ఇస్తుందో లేదో చూడాలి.


