క్రైమ్

Crime : చిన్ననాటి ఫ్రెండ్ అని నమ్మితే నట్టేట ముంచాడు.. చివరకు!

రచన: Kumar•••3 నిమిషాల పఠనం

చిన్న నాటి స్నేహితుడు కదా అని నమ్మితే సదరు వ్యక్తి ఓ వివాహితను నట్టేట ముంచాడు.అంతటితో ఆగకుండా ఆమె మీద పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి బ్లాక్ మెయిల్‌కు దిగాడు.చివరకు బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఆ మోసగాడి బాగోతం బట్టబయలు అయ్యింది.

చిన్న నాటి స్నేహితుడు కదా అని నమ్మితే సదరు వ్యక్తి ఓ వివాహితను నట్టేట ముంచాడు.అంతటితో ఆగకుండా ఆమె మీద పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి బ్లాక్ మెయిల్‌కు దిగాడు.చివరకు బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఆ మోసగాడి బాగోతం బట్టబయలు అయ్యింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది.అనంతరం ఆమె తన అత్తింట్లో ఉంటోంది. అంతా సావ్యంగానే సాగుతున్న ఆమె జీవితంలోకి తన 10వ తరగతి స్నేహితుడు ఉదయ్ ఎంటర్ అయ్యాడు.అతడు టీజీఎస్పీ హైదరాబాద్ 8వ బెటాలియన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

తన ఫ్రెండ్ ఉదయ్‌తో తరచూ ఫోన్లో మాట్లాడటం మొదలెట్టిన యువతి క్రమంగా అతనికి దగ్గరైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 3వ తేదీన ఉదయ్ ఆమె మీద లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. అంతేకాకుండా, లైంగిక దాడికి పాల్పడే సమయంలో వీడియోలను రహస్యంగా చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అంతటితో ఆగకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమె నుంచి రూ.1.3 లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది.డబ్బులు ఇచ్చాక కూడా వేధింపులు ఆపకుండా తన ఇంటికి వచ్చి ఆ వీడియోలను భర్తకు చూపించాడని, దీంతో తనను ఇంటి నుంచి పంపించేశారని, ఆ గొడవల వల్ల గర్భం కోల్పోయానని బాధిత యువతి కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో నిందితుడు ఉదయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు.

#Rape#karimnagar#married women#victim#swechaanews#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి