తెలంగాణ

Kavitha : పెన్షన్ బ్రేక్.. దివ్యాంగుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటం : కవిత

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్యులు, దివ్యాంగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయకుండా పొలిటికల్ డైవర్షన్‌కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వికలాంగులకు పెన్షన్ పెంచుతామని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇంతవరకూ అమలు చేయలేదు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్యులు, దివ్యాంగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయకుండా పొలిటికల్ డైవర్షన్‌కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వికలాంగులకు పెన్షన్ పెంచుతామని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇంతవరకూ అమలు చేయలేదు. దీంతో ఫించన్ దారులు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

తమను నమ్మించి మోసం చేశారని,కొత్త ఫించన్ ఇవ్వలేదు కదా? గత ప్రభుత్వాలు మంజూరు చేసి ఇస్తున్న పింఛన్ కూడా నిలిపివేశారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రై సైకిల్స్ కూడా ఇవ్వడం లేదని ఆందోళనలో ఉన్నారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత దివ్యాంగుల పక్షాన గళం వినిపించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆసక్తికర పోస్టు పెట్టారు.

‘అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి దివ్యాంగులపై కనీస మానవత్వం లేదు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం వారిని చీకటిలోకి నెట్టేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 90 శాతం వైకల్యం ఉండి నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలికి 3 నెలలుగా పెన్షన్ నిలిపివేయడం అన్యాయం.మరోవైపు జగిత్యాల జిల్లాలో ఒక దివ్యాంగ మహిళ డబుల్ బెడ్రూం, ట్రై సైకిల్ మంజూరు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.

దివ్యాంగులకు ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడటం సిగ్గుచేటు. తక్షణమే దీనస్థితిలో ఉన్న దివ్యాంగులకు పింఛన్ కొనసాగించడంతో పాటు డబుల్ బెడ్రూం, ట్రై సైకిల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము’ అని రాసుకొచ్చారు. అయితే, తనకు ఎవరూ లేరని, ఇళ్లు, ట్రై సైకిల్ రాలేదని ఓ దివ్యాంగురాలు ప్రభుత్వ ఆఫీసు ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోను కవిత పోస్టు చేశారు. ఈ ప్రభుత్వ పాలనలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులకు ఇంతకుమించిన సాక్ష్యం ఏముంటుంది అన్నకోణంలో ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.

#kalvakuntla kavitha#congress#TRS#pension#tri cycle#physically handicap#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి