సినిమా

1400 పైగా చిత్రాలు.. రమాప్రభ జీవిత విశేషాలతో ‘ఇదేనండి నా కథ'!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ జీవిత ప్రయాణం పుస్తక రూపంలోకి వచ్చింది. 'ఇదేనండి నా కథ' పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఆత్మకథా శైలి పుస్తకాన్ని ఆమె 81వ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లెలో ఘనంగా ఆవిష్కరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని బసినకొండ పంచాయతీ, గంగన్నగారిపల్లెలో ఉన్న రమాప్రభ నివాసంలో స్థానిక ప్రముఖులు, అభిమానుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు.

 గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ రమాప్రభ ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు జింకల మోహనవల్లి దాదాపు ఏడాది పాటు శ్రమించి, ఆమెను ఒప్పించి ఈ పుస్తకాన్ని రచించడం విశేషం. సాధారణంగా చాలామంది తమ ఆత్మకథలను తామే రాసుకుంటారని, కానీ తన జీవిత కథను మరొకరు ఇంత చక్కగా రాయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రమాప్రభ ఈ సందర్భంగా తెలిపారు.

 నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 1400కు పైగా చిత్రాల్లో నటించి రమాప్రభ తనదైన శైలిలో నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఈ పుస్తకంలో ఆమె సినీ జీవితంలోని ఎత్తుపల్లాలతో పాటు, వ్యక్తిగత జీవితంలోని తీపి, చేదు జ్ఞాపకాలను, అనుభవాలను విపులంగా పొందుపరిచారు. రమాప్రభ జన్మదినాన ఈ పుస్తకం వెలువడటం పట్ల రచయిత్రి మోహనవల్లి ఆనందం వ్యక్తం చేశారు.

 ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నవలా రచయిత టీఎస్ఏ కృష్ణమూర్తి, యాదవల్లి భారతితో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన రోజులతో పాటు, నేడు మదనపల్లెలో ప్రశాంత జీవనం సాగిస్తున్నంత వరకు ఆమె పూర్తి జీవిత ప్రయాణాన్ని ఈ పుస్తకం పాఠకులకు పరిచయం చేస్తుంది.

#RamaPrabha#RamaPrabhaBiography#IdenandiNaKatha#JinkalaMohanavalli#SeniorActressRamaPrabha#Madanapalle#TollywoodNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి