National

Lucknow Airport: లక్నో ఎయిర్‌పోర్ట్ వద్ద కలకలం.. కార్మికులకు తృటిలో తప్పిన ప్రమాదం!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్ విస్తరణ, అభివృద్ధి పనుల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహంలో అనుకోకుండా మంటలు చెలరేగాయి.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్ విస్తరణ, అభివృద్ధి పనుల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహంలో అనుకోకుండా మంటలు చెలరేగాయి.

అధికారుల సమాచారం ప్రకారం.. కార్మికుల కోసం మూడు అంతస్తుల భవనాన్ని పీవీసీ ప్యానెళ్లతో నిర్మించారు. ఇవి సులభంగా మండే స్వభావం కలిగి ఉండటంతో మంటలు క్షణాల్లోనే భవనం మొత్తం వ్యాపించాయి. కొద్ది సేపటికే భారీ అగ్నికీలలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతం అంతా భయానకంగా మారింది. కిలోమీటర్ల దూరం నుంచే పొగ కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

మరోవైపు అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది, అత్యవసర రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. ముందుగా వసతి గృహంలో ఉన్న కార్మికులను బయటకు తరలించెందుకు కృషిచేశారు. కాగా ఈ భవనంలో మొత్తం 33 గదులు ఉండగా, షిఫ్టుల వారీగా పనిచేసే దాదాపు 500 మంది కార్మికులు అక్కడ నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక మంటలు వేగంగా వ్యాపిస్తున్నా రక్షణ సిబ్బంది లెక్కచేయకుండా కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బందితో పాటు లక్నో ఫైర్ సర్వీస్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

మరోవైపు సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్నది ఇంకా తేలలేదు. ఈ ప్రమాదం పై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తాత్కాలిక నిర్మాణంలో అగ్నిప్రమాద భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయన్న కోణంలోనూ విచారణకు సిద్దం అయ్యారు..

#Lucknow Airport#Fire Accident#Lucknow Fire#Airport Fire#Uttar Pradesh#Chaudhary Charan Singh Airport#Fire Incident#Workers Camp#India News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి