Rowdy Janardhana: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రౌడీ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయిన విజయ్ దేవరకొండ..గత కొంతకాలంగా విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఫ్యామిలీ స్టార్, ఖుషి, లైగర్, కింగ్డం..ఇలా వరుసగా తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా, విజయ్ మార్కెట్ కి పెద్ద డ్యామేజ్ ఏమీ కాలేదు.
ప్రస్తుతం, ఈ రౌడీ హీరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి రౌడీ జానార్ధన. హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే, దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుందట. మిగతా టాకీ పార్ట్ కోసం ఫైనల్ షెడ్యూల్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తాజా సమాచారం.
ఈ ఫైనల్ షెడ్యూల్ లో క్లైమాక్స్ కి సంబందించిన కీలకమైన ఎపిసోడ్ ని కంప్లీట్ చేయనున్నారట. దీని కోసం దిల్ రాజు భారీ సెట్స్ ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఇందులో, ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరబోతున్నారు. దీంతో సాంగ్స్ తప్ప టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందట. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు డా.రాజశేఖర్ విలన్ పాత్రలో అలరించబోతున్నాడు.
ఆయన లుక్ అండ్ మేకోవర్ రౌడీ జనార్ధన సినిమాలో చాలా కొత్తగా ఉండబోతుందని టీమ్ చెబుతోంది. కంప్లీట్ యాక్షన్ సినిమాగా రౌడీ జనార్ధన తెరకెక్కుతోంది. ఈ ఏడాది పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇదే, బ్యానర్ లో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ గా మిగిలింది. మరి, రౌడీ జానార్ధన సినిమాతోనైనా విజయ్-దిల్ రాజు హిట్ కొడతారేమో చూడాలి.












