క్రైమ్

Breaking : పరారీలోనే రాజ్‌కుమార్.. సూసైడ్ అంతా ఉత్తదే : ఎస్‌వోటీ పోలీసులు

రచన: Kumar3 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఆరు హత్యల కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ ఆచూకీ ఇంకా దొరకలేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇవాళ ఉదయం రాజ్‌కుమార్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆస్పత్రికి తరలించినట్టు కథనాలు వచ్చాయి.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఆరు హత్యల కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ ఆచూకీ ఇంకా దొరకలేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇవాళ ఉదయం రాజ్‌కుమార్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆస్పత్రికి తరలించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, అదంతా ఉత్తదే అని ఎస్‌వోటీ పోలీసులు తేల్చారు. ప్రస్తుతానికి నిందితుడు పరారీలోనే ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

అతని కోసం 14 టీమ్స్ గాలిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హత్యల అనంతరం రెండు మూడు రోజులుగా కనిపించకుండా పోయిన రాజ్‌కుమార్.. సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకునేందుకు తిమ్మాపూర్ రైల్వే ట్రాక్‌పై నిలుచున్నట్టు తెలిసింది. రైలు వచ్చేవరకు నిలబడి చివరి నిమిషంలో ఆత్మహత్య నిర్ణయాన్ని రాజ్ కుమార్ విరమించుకున్నాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయని పోలీసులు గుర్తించారు.

నిందితుడు రాజ్ కుమార్ వద్ద ప్రస్తుతం 4 సెల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆరు హత్యల అనంతరం వీటిని స్విచాఫ్ చేశాడని తెలిసింది. కాగా, బెంగళూరు, శ్రీశైలం హైవేలపై ఉన్న హోటల్లు, లాడ్జిల్లో పోలీసుల ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.గతంలో శ్రీశైలం వెళ్లి ఎక్కువ రోజులు ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి గాలించి వెనుదిరిగారు. నిందితుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. కాగా, తనను జైలుకు పంపించిందనే కారణంతో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్.. యువతి, ఆమె తల్లి, అమ్మమ్మ.. తన భార్య, ఇద్దరు బిడ్డలను అత్యంత దారుణంగా గొంతు కోసం చంపిన విషయం తెలిసిందే.

#shabad murder case#six killed#accused#escaped#sot police
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి