స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

వెస్సెల్లా.. ది లావిష్ అండ్ లాబీయిస్ట్ ఆఫీసర్స్ అడ్డా?

రచన: Swechaanews Chaiman5 నిమిషాల పఠనం

నార్సింగ్‌లోని ఇబ్రహీంబాగ్‌లో సర్వే నెంబర్ 207 నుంచి 239, 242 నుంచి 255 వరకు 2017 నుంచి 2023 వరకు 38 ఎకరాల్లో 294 విల్లాలు నిర్మించారు.

  • రిజిస్ట్రేషన్స్ లేకుండానే అక్రమంగా లావాదేవీలు

  • భీమ్ రెడ్డి వ్యవహారంతో బయటపడ్డ బాగోతాలు

  • 5 ఏండ్ల క్రితమే రూ.10 కోట్లు పలికిన విల్లాలు

  • మాజీ ఐపీఎస్ రియల్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన శివానంద రెడ్డి

  • ఆ కాలంలోనే బుద్వేల్ భూములను కొట్టేసిన ఘనుడు

  • సగం మంది ఉన్నతాధికారులు ఉన్నట్లు అనుమానం

  • ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు, ఏసీబీకి పట్టుబడ్డ భీమ్ రెడ్డి కూడా అక్కడే

  • రిజిస్ట్రేషన్ విలువతోనే బ్యాంకు లావాదేవీలు

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ ఛైర్మన్, 9848070809

ఆఫీసర్స్‌లో వెస్సెల్లా ఆనందాలు?

నార్సింగ్‌లోని ఇబ్రహీంబాగ్‌లో సర్వే నెంబర్ 207 నుంచి 239, 242 నుంచి 255 వరకు 2017 నుంచి 2023 వరకు 38 ఎకరాల్లో 294 విల్లాలు నిర్మించారు. ఇవన్నీ 5, 6 బెడ్ రూమ్స్ భారీ విల్లాలు. నార్త్‌కి పెద్ద చెరువు ఉండడంతో వాస్తుకు బాగా కలిసి వస్తుందని ఆఫీసర్స్‌కి చెప్పి కొనుగోలు చేయించారు రియల్టర్‌గా మారిన మాజీ ఐపీఎస్ శివానంద రెడ్డి. ఇటీవల రిటైర్డ్ అయినా ఏపీ, తెలంగాణ ఐపీఎస్, ఐఏఎస్‌లు చాలామంది అక్కడే ఉంటున్నారు. సర్వీస్‌‌లో ఉన్నప్పుడు శివానంద రెడ్డికి మేలు చేసినందుకు తక్కువ ధరలకే ఇచ్చారని టాక్. అందుకు బుద్వేల్‌లో 280 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్‌ని కబ్జా పెట్టారు. రికార్డులు మార్చి కొట్టేయాలని చూశారు. ఇలా రంగారెడ్డిలో చాలా అసైన్డ్ ల్యాండ్స్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. 2024లో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసినా పొలిటికల్ పవర్‌తో తప్పించుకున్నారు శివానంద రెడ్డి. గ్రేహౌండ్స్ ల్యాండ్‌ని కూడా కోట్టేయాలని చూశారు. విల్లాలను ఆఫీసర్స్‌కి ఆశ చూపించి లాబీయింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకు బ్లాక్ మనీని నేరుగా ఇచ్చేసి, కేవలం నామ మాత్రపు రిజిస్ట్రేషన్ విలువనే చూపించారు. ఈమధ్య చిక్కిన భీమ్ రెడ్డి అయితే రూ.4.5 కోట్లు ఇచ్చినా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని ఏసీబీ గుర్తించింది. ఇలా ఎంతమంది అధికారులు ఉన్నారోనని అనుమానలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభాకర్ రావు కూడా అక్కడే?

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందుతుడు ప్రభాకర్ రావు కూడా వెస్సెల్లాలో నుంచే వ్యవహారం నడిపారు. అక్కడ మరో మాజీ సీఎస్‌తో తో పాటు అర డజన్ ఐపీఎస్ కుటుంబాలు ఉన్నాయి. కొందరు ముఖ్యమైన ఆఫీసర్స్ అక్కడే ఉంటున్నారు. ఆ విల్లాల విలువ ఇప్పుడు రూ.20 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఎంతో టైట్ సెక్యూరిటీతో లోపలకు పంపిస్తారు. ఆఫీసర్స్ వివరాలు మా దగ్గర ఉన్నా వాళ్ల ప్రైవసీ కోసం స్వేచ్ఛ న్యూస్ బయటపెట్టడం లేదు. కానీ భూ కుంభకోణాలు చేసే మాజీ అధికారితో చేతులు కలిపి ప్రభుత్వ భూములను కాజేసేందుకు మాత్రం కారకులు అయ్యారు కొంతమంది అధికారులు.

2017లో అలా 2023లో ఇలా?

వెస్సెల్లాలో లావీష్ విల్లాలతో లాభాలు అలవాటు పడ్డ తెలంగాణ బ్యూరోక్రాట్స్ సుమారు 25 మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కుటుంబాల పేర్లతో మహేశ్వరం నాగారంలో భూదాన్ భూములు కొనుగోలు చేశారు. ఆ భూములపై కొంత మందికి సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట లభించింది. ఈఐపీఎల్ రియల్ ఎస్టేట్ సంస్థ చక్రం తిప్పి ఆఫీసర్స్ అందరిని హైకోర్టు గడప తొక్కేలా చేశారు. ఇప్పటికైనా ఆ విల్లాల నుంచి నడిచే వ్యవహారాలను నిఘా వర్గాలు, అవినీతి నిరోధక శాఖ దృష్టి పెడితే చాలామంది బినామీలు బయటపడుతారని సమాచారం.

#Vessella#Luxury Villas#IPS Officers#Corruption Allegations#Real Estate Scam#ACB Investigation
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి