Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఈ సినిమా ఆగస్టు నెలలో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు. దీనిలో టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మెగా హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ నుంచి మాత్రమే సినిమాలు వస్తున్నాయి.
కానీ, మెగా యంగ్ హీరోల నుంచి సినిమాలు రావడం లేదు. ముఖ్యంగా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి సినిమా వచ్చి చాలాకాలం అయింది. గని సినిమా తర్వాత వరుణ్ సోలో హీరోగా సినిమా రాలేదు. వెంకటేష్ తో కలిసి నటించిన ఎఫ్ 2, ఎఫ్ 3 మంచి కమర్షియల్ సక్సెస్ ని సాధించాయి. కానీ, మెగా ఫ్యాన్స్ కోరుకుంటుంది మాత్రం సోలోగా సినిమా.
ఆ సినిమా ఇప్పుడు వచ్చేందుకు రెడీ అవుతోంది. కొరియన్ బ్యాక్‌డ్రాప్ లో కథ సాగుతుందని ఇప్పటికే, మేకర్స్ హింట్ ఇచ్చారు. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న కొరియన్ కనకరాజు సినిమాను ఆగస్టు 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా టీజర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ డిజిటల్ వేదిక రిలీజ్ చేశాడు.
మెగా ఫ్యామిలీకి, ప్రభాస్ కి మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే, ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఇక, ఇందులో వరుణ్ తేజ్ సరసన మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ నటించింది. కమెడియన్ సత్య కీలక పాత్రలో నటించాడు. ఇండో కొరియన్ నేపథ్యంలో కథ, కథనాలు సాగనున్నాయి. అంతేకాదు, కామెడీ ఎంటర్‌టైనర్‌గా కొరియన్ కనకరాజు రాబోతుందనే విషయం తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ద్వారా అర్థమవుతోంది.












