సినిమా

Sanjay Dutt: బాలయ్యకి అన్నయ్యగా బాలీవుడ్ సీనియర్ హీరో?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Sanjay Dutt: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి రైటర్‌గా పనిచేసిన కొరటాల శివ, ఆ అనుభవంతో డార్లింగ్ ప్రభాస్ హీరోగా మిర్చి సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క శెట్టి నటించింది. మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న మిర్చి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకూ అందరి ప్రశంసలు అందుకున్నాడు.

ఆ తర్వాత కొరటాల శివ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను, జూనియర్ ఎన్‌టిర్ తో జనతా గ్యారేజ్, దేవర సినిమాలను రూపొందించాడు. అలాగే, మెగా మల్టీస్టారర్‌గా ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే, ఈ సినిమా ఫ్లాపవడంతో కొరటాలకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది.

దేవర సినిమా చేసినా, అది అందరినీ మెప్పించలేదు. దేవర 2 ఉందనుకున్నారు. కానీ, అది పెండింగ్ లో పడింది. ఎట్టకేలకి కొరటాల శివ, ఓ మాస్ కథతో నటసింహం నందమూరి బాలకృష్ణని మెప్పించి ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాడు. ఇటీవలే, ఈ సినిమా గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకుంది. త్వరలో, రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. బాలయ్య మార్క్ మాస్ కథను కొరటాల శివ స్టైల్లో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

అయితే, తాజాగా బాలయ్య-కొరటాల శివ సినిమాకి సంబందించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రను చేయనున్నాడట. కొరటాల, బాలయ్యకి సోదరుడి పాత్ర కోసం ఏకంగా సంజయ్ దత్ నే సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియదు గానీ, నిజంగా సంజయ్ దత్ గనక బాలయ్య సినిమాలో నటిస్తే ఆ కిక్కే వేరు. గ్యారెంటీగా భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. చూడాలి మరి, దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.

#balakrishna#koratalashiva#sanjaydutt#nbk112
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి