ఏపీ

Vangaveeti Radha: జనసేన గూటికి వంగవీటి వారసుడు..

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

Vangaveeti Radha: బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రాధాకృష్ణకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యాలయానికి చేరుకున్న వంగవీటి రాధాను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

అనంతరం తన వెంట వచ్చిన ముఖ్య అనుచరులను రాధాకృష్ణ పవన్‌కు పరిచయం చేయగా, వారందరినీ ఆప్యాయంగా పలకరించిన పవన్ వారితో ఫొటోలు దిగారు. జనసేన సిద్ధాంతాల సాధనకు అంతా కలసికట్టుగా పనిచేయాలని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు. రాధా చేరికతో విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాధా జనసేనలోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

#Vangaveeti Radhakrishna#Vangaveeti Radha#Janasena Party#Pawan Kalyan#Andhra Pradesh Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి