తెలంగాణ

TG: "వాటాలు కుదరకే నైనీ టెండర్ రద్దు..".. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: సింగరేణి సంస్థను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, కమిషన్ల పంపకాల్లో తేడాలు రావడం వల్లే సొంత మంత్రులే కుంభకోణాలను బయటపెట్టుకుంటున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వేదికగా నిర్వహించిన 'సింగరేణి కార్మిక గర్జన' సభలో ఆయన పాల్గొని, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఫైర్ అయ్యారు.

TG: సింగరేణి సంస్థను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, కమిషన్ల పంపకాల్లో తేడాలు రావడం వల్లే సొంత మంత్రులే కుంభకోణాలను బయటపెట్టుకుంటున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వేదికగా నిర్వహించిన 'సింగరేణి కార్మిక గర్జన' సభలో ఆయన పాల్గొని, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఫైర్ అయ్యారు.

నైనీ బ్లాక్‌లో వాటాల లొల్లి..

నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. "తామే నైనీ కుంభకోణాన్ని అడ్డుకున్నామని, దానివల్ల ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు మిగిలాయని మంత్రి గొప్పలు చెబుతున్నారు. అసలు నిజం అది కాదు.. లోపల వాటాల పంపకాలు కుదరకే ఈ టెండర్లను రద్దు చేసుకుని, ఒకరి గుట్టును మరొకరు రచ్చకెక్కించుకుంటున్నారు" అని ఎద్దేవా చేశారు. కేవలం నైనీ మాత్రమే కాకుండా.. ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ రూల్స్‌ పేరుతో ఏకంగా రూ.10 వేల కోట్ల భారీ స్కామ్‌కు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. వీటితో పాటు సోలార్ ప్లాంట్లు, జిలెటిన్ స్టిక్స్ కొనుగోళ్ల వ్యవహారాల్లో మరో నాలుగైదు భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాత్రపైనా అనుమానాలు..

సింగరేణిలో జరుగుతున్న దోపిడీపై ఆధారాలతో సహా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. "కార్మికుల కష్టార్జితాన్ని కొల్లగొడుతూ సంస్థను ఆగం చేస్తున్నారని, సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశాం. కానీ కిషన్‌రెడ్డి ఏం చేశారు? సింగరేణిలో దొంగతనం జరిగింది.. నువ్వే పట్టుకో అంటూ మళ్లీ సీఎంకే లేఖ రాసి చేతులు దులుపుకున్నారు" అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరినొకరు కాపాడుకుంటూ, కమిషన్లు పంచుకుంటూ సింగరేణిని నిలువునా కొల్లగొడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన తేల్చిచెప్పారు.

#KTR#K Taraka Rama Rao#Telangana Politics#Naini Coal Block#Singareni Collieries#Revanth Reddy#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి