National

UAE Lottery: నిజమైన లక్కీభాస్కర్‌.. రూ.13 కోట్ల లాటరీ గెలిచిన భారతీయుడు..

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

UAE Lottery: సినిమాల్లో లక్కీభాస్కర్ కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి.. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఓ భారతీయుడి విషయంలో అది అక్షరాలా నిజమైంది. చిన్నపాటి ఆశతో కేవలం 50 దిర్హామ్‌లు (సుమారు రూ.1,100) పెట్టి కొన్న ఒక్క లాటరీ టికెట్ ఆయన తలరాతను పూర్తిగా మార్చేసింది. ఏకంగా 5 మిలియన్ దిర్హామ్‌లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13 కోట్ల జాక్‌పాట్ కొట్టేసి రాత్రికి రాత్రే నిజమైన 'లక్కీభాస్కర్'గా మారారు.

అసలేం జరిగిందంటే..

షార్జా నగరంలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన కిశోర్, ఇటీవల ‘యూఏఈ లాటరీ’ అధికారిక వెబ్‌సైట్ నుంచి 50 దిర్హామ్‌లు వెచ్చించి ఒక టికెట్ కొనుగోలు చేశారు. అక్టోబర్ 3న తీసిన ఈ డ్రాలో అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా 30 మిలియన్ల దిర్హామ్‌లతో కూడిన మెగా మొదటి బహుమతిని ఎవరూ గెలుచుకోలేకపోయారు. కానీ ఆ తర్వాత ఉన్న రెండో అతిపెద్ద బహుమతి 5 మిలియన్ దిర్హామ్‌లు మాత్రం కిశోర్‌ను వరించింది.

వార్తల్లో పేరు చూసి షాక్..

డ్రా రిజల్ట్ వచ్చాక వార్తల్లో విజేతగా తన పేరు కనిపించడంతో కిశోర్ మొదట తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అది నిజమేనా లేక ఏదైనా పొరపాటా అని అనుమానంతో వెంటనే తన లాటరీ టికెట్ నంబర్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నారు. నంబర్ సరిగ్గా ఉండటంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "న్యూస్‌లో నా పేరు రావడం చూసి అస్సలు నమ్మలేకపోయాను. వెంటనే టికెట్ నంబర్ సరిచూసుకున్నాక గానీ నాకు నమ్మకం కూదరలేదు " అంటూ కిశోర్ సంబరపడిపోయారు. పరాయి దేశంలో కష్టపడుతూ జీవనం సాగించే ఒక సాధారణ ప్రవాస భారతీయుడిని అదృష్టం ఇలా రూ.13 కోట్ల రూపంలో వరించడంతో, యూఏఈలోని భారతీయులు ఆయన్ను అసలైన 'లక్కీభాస్కర్' అంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

#: UAE Lottery#Kishore#Indian Lottery Winner#UAE Lottery Winner#5 Million Dirhams#₹13 Crore Jackpot#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి