తెలంగాణ

Harish Rao: ఒక్కొక్కరికి రూ.10లక్షలు ఇవ్వాలి- గద్వాల రోడ్డు ప్రమాద బాధితులకు హరీష్ రావు పరామర్శ

రచన: NK••3 నిమిషాల పఠనం

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస కూలీల కుటుంబాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పరామర్శించారు.

Harish Rao: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస కూలీల కుటుంబాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పరామర్శించారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన దళిత వలస కూలీల కుటుంబాలతో ఆయన మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి యోగ క్షేమాలు అడుగుతున్న క్రమంలో కేసీఆర్ సార్ బాగున్నారా సార్ అని బాధితులు హరీష్ రావును అడిగారు.

మనోళ్లు కూలి పనులకు వెళుతుండగా ప్రమాదం జరిగింది, ఒకసారి వాళ్ళని కలిసి పరామర్శించి సాయం చేయమని కేసీఆర్ మమ్మల్ని మీ దగ్గరికి పంపారని వారితో హరీశ్ రావు చెప్పారు. చనిపోయిన ఇద్దరి కుటుంబాలకు సాయం చేశాము, మీ అందరికీ కూడా సాయం చేస్తాం. గద్వాల కలెక్టర్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్తాం. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తామని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు హరీశ్ రావు.

ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు హరీశ్ రావు. పాలమూరును మరోసారి కరువు, వలసల వలయంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం నెడుతోందన్నారు. కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో మరణించిన గద్వాల జిల్లా వలస కార్మికులకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి కోసం ఇందువాసి గ్రామానికి చెందిన సుమారు 40 దళిత కుటుంబాలు కర్ణాటకకు వలస వెళ్లాయని.. అక్కడ జరిగిన ప్రమాదంలో కూలీలు చనిపోవడం బాధాకరమన్నారు హరీశ్ రావు.

#Harish Rao#Road Accident#Gadwal#Karnataka#Swechaa News#Migrant Workers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి