సినిమా

Trivikram: చిక్కుల్లో ఆదర్శకుటుంబం..నిర్మాతకి గట్టి షాక్?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Trivikram: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదర్శకుటుంబం చిత్రానికి కాపీ సెగ గట్టిగా తగిలింది. ఈ సినిమాలోని ఓ పాటను కాపీ చేశారంటూ మేకర్స్ మీద కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలు టాలీవుడ్‌లో బాగా సంచలనం అవుతున్నాయి. మొన్నటికిమొన్న ఆర్పీ పట్నాయక్ మీద ఒకావిడ తన పాటలను తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఇప్పుడు, వెంకటేష్ నటించిన ఆదర్శకుటుంబం సినిమా మేకర్స్ మీద కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

పూరి-ఛార్మీపై మండిపడ్డ చైతన్య రెడ్డి:

హనుమాన్, ఆచార్య లాంటి సినిమాలను నిర్మించిన నిరంజన్ రెడ్డి-చైతన్య రెడ్డి ప్రస్తుతం, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సంబరాల ఏటిగట్టు సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీని 2027 సంక్రాంతికి తీసుకువస్తున్నారు. అయితే, గతంలో పూరి జగన్నాధ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తీవ్రంగా నష్టపోయారట. దీంతో, రికవరీకి కాల్ చేస్తే ఛార్మీ బెదిరించిందని ఈ మధ్య పలు ఇంటర్వ్యూలలో చైతన్య రెడ్డి చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై, పూరి-చార్మీ ఇప్పటి వరకూ స్పందించలేదు.

గరివిడి లక్ష్మీని ఆర్పీ పట్నాయక్ మోసం చేశాడా?

తాజాగా ఇష్యూలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్..విలేజ్ సింగర్ గరివిడి లక్ష్మిని మోసం చేశాడంటూ ఆమెనే స్వయంగా పలు మీడియా ఛానళ్ళలో ఓపెన్ అయింది. కానీ, పట్నాయక్ మాత్రం దీనిపై చెప్పిన సమాధానం పూర్తి భిన్నంగా ఉంది. రెండు మూడు రోజుల హడావిడి తర్వాత ఈ వ్యవహారం సద్దుమనిగింది. ఇంతలోనే, ఆదర్శకుటుంబం సినిమాలోని పాట గురించి 'పర్ణశాల' చిత్ర బృందం న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

ఆదర్శకుటుంబం సినిమాకి రిలీజ్ రోజు డివైడ్ టాక్ వచ్చింది. కానీ, మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ ఇప్పుడే కాస్త కలెక్షన్ల పరంగా ఊపందుకుంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఈ సినిమాలోని జానపద కళాకారిణి జి. లక్ష్మీదేవి రాసి.. పాడినటువంటి జానపద గీతం ‘జిమ్ జిమ్ తారా’ ‘ఆదర్శ కుటుంబం’లో ఎలాంటి అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని నిర్మాత మంచి వెంకట్ ఆరోపించారు. మరి, దీనిపై ఆదర్శకుటుంబం మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

#Adarsha Kutumbam#Venkatesh#AK 47#Trivikram#Srinidhi Shetty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి