తెలంగాణ

TG: రైతుల బతుకులతో రేవంత్ ఆటలు.. 24 గంటల కరెంట్ ఏదని ప్రశ్నించిన కేటీఆర్!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీని గాలికొదిలేసి రైతులను నట్టేట ముంచారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీని గాలికొదిలేసి రైతులను నట్టేట ముంచారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన 'రైతు గర్జన' సభకు వెళ్తున్న క్రమంలో ముఖరా (కే) రోడ్డు వద్ద మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌లతో పాటు పలువురు రైతులు ఆయనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

నీరు, కరెంట్ సక్రమంగా అందక నిలువునా ఎండిపోయిన పత్తి పంటలను కేటీఆర్‌కు చూపించి రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. "రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో సాగునీరు అందించక, విద్యుత్ సరఫరా చేయక చేతులెత్తేశారు. మరోవైపు రైతు భరోసా సాయం కూడా సకాలంలో అందించకుండా రైతుల బతుకులను పూర్తిగా నాశనం చేశారు" అని మండిపడ్డారు.

ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ సర్కార్ చేతగానితనం వల్ల రైతులపై బలవంతంగా రుద్దిన కృత్రిమ కరువు అని కేటీఆర్ మండిపడ్డారు. పంటలు ఎండిపోయి అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పత్తి పంటకు ఎకరానికి రూ.25 వేలు, అలాగే సోయా, ఇతర పంటలకు ఎకరానికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

#KTR#Revanth Reddy#Telangana Politics#BRS#Congress Government#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి