తెలంగాణ

TG: ‘మురాసు’ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణకు రెడ్ అలర్ట్!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న ‘మురాసు’ తుపాను ప్రభావంతో తెలంగాణపై వరుణుడు పంజా విసరనున్నాడు. రానున్న మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

TG: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న ‘మురాసు’ తుపాను ప్రభావంతో తెలంగాణపై వరుణుడు పంజా విసరనున్నాడు. రానున్న మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

నవంబర్ 3న డేంజర్ బెల్స్.. ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

ఈ తుపాను ప్రభావం నవంబర్ 3న పీక్ స్టేజ్‌కు చేరనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ముంచెత్తే అవకాశముండటంతో ఈ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఇదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ‘ఆరెంజ్ అలర్ట్’ ఇచ్చారు. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.

రేపు తీవ్రరూపం..

రాష్ట్రంలో రేపటి నుంచే వర్షాల జోరు మరింత పుంజుకోనుందని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. దాదాపు 20 జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడనున్నాయన్నారు.

నవంబర్ 5 వరకు పరిస్థితి ఇదే

ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు మొదలయ్యాయి. ఇక నవంబర్ 5 వరకు కూడా వానల తాకిడి కొనసాగనుందని చెప్పారు. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని, ఉత్తర, తూర్పు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని అధికారులు వివరించారు. ఈదురుగాలులు, పిడుగుపాటు ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.

#Telangana Weather#Murasu Cyclone#Telangana Rain Alert#Red Alert#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి