ఏపీ

AP: "ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే మళ్లీ మావోయిస్టులు పుడతారు".. జగన్ సంచలన వ్యాఖ్యలు!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

AP: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కూటమి ప్రభుత్వ హయాంలో పోలీసులు దగ్గరుండి మరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

AP: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కూటమి ప్రభుత్వ హయాంలో పోలీసులు దగ్గరుండి మరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయం జరగనప్పుడు ప్రజల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుంటుందని హెచ్చరించిన ఆయన.. "ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసినప్పుడే సమాజంలో కాక్రోచ్‌లు, మావోయిస్టులు లాంటి విప్లవ పరిణామాలు పుట్టుకొస్తాయి" అంటూ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచనలం సృష్టిస్తున్నాయి.

తన సొంత ఇలాకా అయిన పులివెందులలో జరుగుతున్న అరాచకాలే ఇందుకు నిదర్శనమని జగన్ నిప్పులు చెరిగారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 80 పోలింగ్ బూతులు ఉంటే, ఏకంగా 70 బూతుల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఉదయం 4 గంటల నుంచే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్‌లను తమ గుప్పిట్లోకి తీసుకున్నారని ఆరోపించారు. ఓటు వేసేందుకు లైన్లలో నిలబడిన సాధారణ పౌరుల నుంచి ఓటర్ స్లిప్పులను దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారని, ఓటర్లను పోలీసులు దగ్గరుండి భయపెట్టి వెనక్కి పంపిస్తున్నారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి పోలీసులు బాహాటంగా సహకరిస్తూ ఎన్నికల తీరును మార్చేశారని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

పోలింగ్ కేంద్రాల్లో పారదర్శకత కోసం కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకుండా పక్కా ప్లాన్‌తో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. కళ్లముందే ఇంతటి దారుణమైన అక్రమాలు, దాడులు జరుగుతుంటే ఎన్నికల అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియను నిరసిస్తూ, తక్షణమే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. అధికార బలం, పోలీసు యంత్రాంగంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆయన స్పష్టం చేశారు.

#YS Jagan Mohan Reddy#Andhra Pradesh Politics#AP Municipal Elections#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి