సినిమా

Tollywood: అప్పుడు రవీనా..ఇప్పుడు కాజోల్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: ఒకప్పుడు రవీనా టాండన్ తెలుగు సినిమాలలో నటించి మంచి హిట్స్ అనుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా, ఆ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హిందీలో మాత్రం ఒకదశలో క్రేజీ హీరోయిన్‌గా గోవింద, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ పక్కన నటించి స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. చాలా ఏళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కేజీఎఫ్ ఛాప్టర్ 2తో సౌత్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాకి ముందే కాజోల్ బాలీవుడ్ సినిమాలు చేస్తూనే కోలీలీడ్‌లో ఎంట్రీ ఇచ్చి ధనుష్ నటించిన విఐపి 2 సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్వతహాగా కాజోల్ మంచి పర్ఫార్మర్. చలాకీ పాత్రల్లో, ఎమోషనల్ పాత్రల్లో, అమాయకంగా కనిపించే పాత్రల్లో నటించి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ లాంటి వారికి హిట్ పేయిర్ కూడా.

అంత టాలెంటెడ్ నటి సీనియారిటీ వచ్చాక ఇతర భాషల్లో అవకాశం, అది కూడా నెగిటివ్ రోల్ అంటే ఒప్పుకోవడం కష్టమే. కానీ, కాజోల్..రవీనా టాండన్ సౌత్ సినిమాలలో నటించి మెప్పించారు. ఏకంగా హీరోలనే ఢీకొనే పాత్రల్లో నటించి సౌత్‌లో కలుమోపారు. అయితే, తాజా సమాచారం మేరకు కాజోల్ ఓ తెలుగు సినిమా చేసేందుకు సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే, నిజమైతే ఖచ్చితంగా ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి.

భాగ్యశ్రీ తర్వాత కాజోల్:

మైనే ప్యార్‌కియా సినిమాతో దేశాన్నే ఊపేసిన భాగ్యశ్రీ చాలా ఏళ్ళకి ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాలో ఆయనకి తల్లి పాత్రలో నటించింది. గిరిజ పాత్రలో భాగ్యశ్రీ నటన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఫ్లాప్ కాకుండా ఉంటే ఇక్కడ మరిన్ని అవకశాలు వచ్చి ఉండేవి. ఇక, కాజోల్ కూడా నందమూరి మోక్షజ్ఞ నటిస్తున్న డెబ్యూ మూవీలో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమె కూడా మోక్షజ్ఞ కి తల్లిగా కనిపించే పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. త్వరలో, దీనిపై అధికారిక ప్రకటన రానుందట.

#Nandamuri Mokshagna#Mallidi Vassishta#Mythri Movie Makers#Kajol
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి