తెలంగాణ

జలమండలి కీలక ప్రకటన.. ట్యాంకర్లలో శుద్ధి చేసిన నీటి సరఫరా.. ధరలివే!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ నగరంలో తాగునీటిపై పెరుగుతున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించడానికి హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (HMWSSB) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. తాగునీటి సేవలతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP) ద్వారా శుద్ధి చేసిన నీటిని (Treated Water) మానవేతర అవసరాలకు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది.

 హైదరాబాద్ నగరంలో తాగునీటిపై పెరుగుతున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించడానికి హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (HMWSSB) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. తాగునీటి సేవలతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP) ద్వారా శుద్ధి చేసిన నీటిని (Treated Water) మానవేతర అవసరాలకు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. ముఖ్యంగా నగరంలోని నిర్మాణాలు, కార్ వాషింగ్ కేంద్రాలు, గార్డెనింగ్, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా ఈ శుద్ధి చేసిన నీటిని అందించనున్నారు.

 ఈ విధానం అమలు కోసం జలమండలి నగరం నలుమూలలా 27 ఫిల్లింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా గుర్తించడమే కాకుండా, తొలి విడతలో 21 ప్రత్యేక గ్రీన్ ట్యాంకర్లను (Green Tankers) సిద్ధం చేసింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా జలమండలి ఆధ్వర్యంలో 45 మురుగునీటి శుద్ధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ శుద్ధి చేస్తున్న సుమారు 1500 మిలియన్ గ్యాలన్ల మురుగునీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ రీసైకిల్ నీటిని ఇతర అవసరాలకు ఉపయోగించడం వల్ల నగరంలో తాగునీటి డిమాండ్ సుమారు 20 శాతం వరకు తగ్గుతుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి వెల్లడించారు. రోజూ 646 ఎంఎల్‌డీల శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

 శుద్ధి చేసిన నీటి రవాణా కోసం జలమండలి గ్రీన్ ట్యాంకర్ల కొత్త ధరల పట్టికను అధికారికంగా ఖరారు చేసింది: 5,000 లీటర్ల ట్యాంకర్: 4 కిలోమీటర్ల పరిధి వరకు రూ.400 (ఆపై ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.55 అదనంగా చెల్లించాలి). 10,000 లీటర్ల ట్యాంకర్: 4 కిలోమీటర్ల పరిధి వరకు రూ.800 (4 కి.మీ దాటితే ప్రతి కిలోమీటరుకు రూ.65 చొప్పున వసూలు చేస్తారు). 20,000 లీటర్ల ట్యాంకర్: 4 కిలోమీటర్ల పరిధి వరకు రూ.1,600 (4 కి.మీ దాటితే ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.80 ఛార్జ్ చేస్తారు).

 వినియోగదారులకు అందించే నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జలమండలి ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ విధానం వల్ల తాగునీటి వృథా గణనీయంగా తగ్గడమే కాకుండా, నగరంలో కమర్షియల్ అవసరాలకు తక్కువ ధరలోనే నీటి సరఫరా లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

#HMWSSBTreatedWater#HyderabadWaterBoard2026#GreenTankerPrices#TreatedWaterSupplyHyd#MusiRiverWaterRecycle#HydNewsTelugu#TelanganaNewsTelugu#CityInfrastructureHyd
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి