Tollywood: ప్రస్తుతం, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలకి ఇక్కడి సీనియర్ హీరోలను, నటులనే తీసుకుంటున్నారు. ఒకరకంగా, ఇది చాలామంచి పరిణామం అని చెప్పాలి. ఇంతకముందు వరకూ ఎక్కువగా బాలీవుడ్ సహా ఇతర సౌత్ భాషలలోని వారిని మన తెలుగు సినిమాలలో క్యారెక్టర్స్ కోసం, విలన్ రోల్స్ కోసం తీసుకునేవారు. కానీ, ఈ మధ్య మన మేకర్స్ ఆలోచనలో మార్పులొచ్చాయి. తెలుగులో నటించినవారికే అవకాశం ఇస్తున్నారు.
మంచు హీరోలకి మంచి ఛాన్స్:
మంచు ఫామిలీ హీరోలలో మోహన్ బాబు సీనియర్ హీరోలలో ఒకరిగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానం సంపాదించుకున్నారు. నిర్మాతగా అద్భుతమైన చిత్రాలను అందించారు. ఆ తర్వాత మోహన్ బాబు తన వారసులను చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. మంచు విష్ణు, మనోజ్, మంచు లక్షీ ..ముగ్గురూ నటులుగా ప్రూవ్ చేసుకున్నారు. హీరోయిన్‌గా, నెగిటివ్ పాత్రలో మంచు లక్ష్మీ బాగానే ఆకట్టుకుంది. విష్ణు, మనోజ్ కూడా హీరోలుగా ఆకట్టుకున్నారు.
కానీ, హీరోలుగా మంచి విజయాలను అందుకున్న మనోజ్ ఆ తర్వాత ఆ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. విష్ణు కూడా హీరోగా చేసిన సినిమాలు ఫ్లాపయ్యాయి. అలాగే, వీరు నిర్మాణ రంగంలోనూ తీవ్ర నష్టాలను చూశారు. దీంతో, మంచు ఫ్యామిలీకి గ్యాప్ వచ్చింది. మళ్ళీ, ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి. మంచు ఫ్యామిలీ నుంచి మళ్ళీ మోహన్ బాబు, మనోజ్ తెలుగు సినిమాలలో అవకాశాలను అందుకుంటున్నారు.
విలన్స్‌గా మెప్పిస్తున్న మోహన్ బాబు-మనోజ్:
హీరోగా 500 చిత్రాలకి పైగా విభిన్నమైన పాత్రల్లో నటించిన మోహన్ బాబు హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో విలన్ పాత్రలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గతంలో, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాలో వినల్‌గా భయపెట్టాడు. మంచు మనోజ్ కూడా మిరాయ్, భైరవం లాంటి సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, బాలయ్యతో కలిసి దాదా సినిమాను చేస్తున్నాడు. మొత్తానికి, మన టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న మంచు ఫ్యామిలీ నటులు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుండటం ఆనందకరమైనది.


