National

ధనుష్ మాస్టర్ ప్లాన్.. తమిళనాట 3,000 మంది లాయర్లతో కొత్త వ్యూహం!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

తమిళ సినీ పరిశ్రమ నుంచి మరో ప్రముఖ కథానాయకుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రముఖ నటుడు ధనుష్ రాజకీయ అరంగేట్రంపై గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆయన అభిమాన సంఘం సంచలన వ్యూహాలను అమలు చేస్తోంది.

 తమిళ సినీ పరిశ్రమ నుంచి మరో ప్రముఖ కథానాయకుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రముఖ నటుడు ధనుష్ రాజకీయ అరంగేట్రంపై గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆయన అభిమాన సంఘం సంచలన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇటీవల తన అభిమాన సంఘాన్ని ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చి కొత్త జెండాను ఆవిష్కరించిన ఆయన, తాజాగా తమిళనాడంతటా 3,000 మంది న్యాయ సలహాదారులను నియమించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

 వెలువడుతున్న కథనాల ప్రకారం.. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గానికి సుమారు 12మంది చొప్పున లాయర్లను నియమించేలా ధనుష్ బృందం కసరత్తు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న తమ సంస్థ నిర్వాహకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఎదుర్కొనే వివిధ చట్టపరమైన, సామాజిక చిక్కులకు వీరు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తారని సమాచారం. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ గతంలో తన అభిమాన సంఘాలను ఇదే తరహా సంక్షేమ కార్యక్రమాల ద్వారా బలోపేతం చేసుకుని రాజకీయ పార్టీ స్థాపించారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఇటీవలే చైన్నైలోని సెంమంచేరిలో 3,000 మందికి పైగా మహిళా అభిమానులతో ధనుష్ ప్రత్యేక సమావేశం నిర్వహించడం, వారికి కానుకలుగా వెండి దీపాలు బహూకరించడం పెద్దఎత్తున రాజకీయ దుమారం రేపింది. 2027 జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10, 12వ తరగతి విద్యార్థుల కోసం ఏసీ సౌకర్యంతో ఉచిత ట్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళా విభాగాలు, న్యాయ విభాగాలు, ఉచిత పాఠశాల నిధులు వంటి క్షేత్రస్థాయి కార్యకలాపాలు రాబోయే ఎన్నికల ప్రక్రియ కోసం వేస్తున్న బలమైన అడుగులుగా మారాయి.

 ఈ పరిణామాలపై తమిళనాడు రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే వర్గాలు ఈ మార్పులను ప్రజాస్వామ్య హక్కుగా వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు దీన్ని బీజేపీ ‘ఆపరేషన్ డి’ వ్యూహంగా విమర్శిస్తున్నాయి. కాగా, ఈ ఊహాగానాలపై ధనుష్ లేదా ఆయన అధికారిక బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆయన తాను అంగీకరించిన వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో వేగంగా మారుతున్న ఈ నిర్మాణాత్మక మార్పులు ధనుష్ రాజకీయ ప్రవేశానికి పక్కా పునాది వేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు బలంగా విశ్వసిస్తున్నారు.

#DhanushPoliticalEntry2026#DhanushNarpaniIyakkam#TamilNaduPolitics2026#Dhanush3000Lawyers#VijayTVKVsDhanush#KollywoodNewsTelugu#EntertainmentNewsTelugu#PoliticalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి