Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా ఎదగడం చాలాకష్టం. ఇక్కడున్న పోటీని తట్టుకొని ఒక పాటకు డాన్స్ కొరియోగ్రఫీ అందించే అవకాశం అందుకోవాలంటే ఎన్నో ఏళ్ళ శ్రమ..పట్టుదల..నిజాయితీ..అన్నిటికీ మించి ఐడెంటిటీ చాలా ముఖ్యం. ఇవన్నీ ఉన్న ఈతరం కొరియోగ్రాఫర్ భాను మాస్టర్. సైలెంట్‌గా సాంగ్స్ చేస్తూ..ఒక్కో సాంగ్‌ను అద్భుతంగా తెరకెక్కించి ఇండస్ట్రీలో పలువురి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
సింగిల్ కార్డ్ కొరియోగ్రాఫర్:
ఖడ్గం సినిమాలో దర్శకుడు కృష్ణ వంశీ రాసిన డైలాగ్‌లాగా "ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్..నేనేంటో చూపిస్తా"..అన్నది ఎంత నిజమో, సినిమా పరిశ్రమలో పనిచేసేవాళ్ళకి తెలుస్తుంది. అలా, ఒక్క ఛాన్స్ భాను మాస్టర్‌ను నేడు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఒక్క పాటకి డాన్స్ కొరియోగ్రఫీ అందించే అవకాశం వస్తే చాలనుకుంటున్న పెద్దపెద్ద డాన్స్ మాస్టర్స్ ఉన్న మన తెలుగు, తమిళ భాషల్లో.. భానుకి సింగిల్ కార్డ్ కొరియోగ్రాఫర్‌గా సినిమాలు రావడం గొప్ప విషయం. దీనికి, ప్రత్యేకించి చెప్పాలంటే ఆయన నిజాయితీగా పాటిస్తున్న వృత్తి ధర్మమే.
వింటేజ్ హీరోలను చూపిస్తున్న భాను:
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నందమూరి బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకి డాన్స్ కొరియోగ్రఫీ చేయడం ఓ గొప్ప అవకాశం, గొప్ప అనుభవం. వీరి సినిమాలు చేస్తూ పెరిగిన ఎవరికైనా..వారితోటే కలిసి పనిచేసే అవకాశం..వారికే డాన్స్ కొరియోగ్రఫీ చేసే అద్భుతమైన రోజులు దక్కడం భానూ మాస్టర్‌కి అందిన వరం. శేఖర్, జానీ, రాఘవ లారెన్స్, ప్రభుదేవ, రాజు సుందరం, బాబా మాస్టర్, రఘు మాస్టర్, ప్రేమ్ రక్షిత్, విజయ్ బిన్నీ, గణేష్, దినేష్ మాస్టర్, గణేష్ ఆచార్య లాంటి సీనియర్స్ ఉన్నా, ఇప్పుడు వస్తున్న యంగ్ డాన్స్ కొరియోగ్రాఫర్స్ చెప్పలేనంతమంది ఎదురుచూస్తూ ఉన్నా..ఇంతమందిని దాటుకొని భాను వరకూ పాట వస్తుందంటే ఆయన కమిట్మెంట్, హీరోల ప్రేమ, దర్శకుల అభిమానం, నిర్మాతల ఎంకరేజ్మెంట్, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే.
బడ్జెట్లో సాంగ్ చేయాలంటే భానుకే ఫోన్:
ఒక్క సాంగ్ కోసం విదేశాలకి వెళ్ళడం, కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్స్ వేయించడం, అవసరం లేకపోయినా వెనకాల వందలకొద్ది డాన్సర్స్‌ను పెట్టడం..ఇలాంటివేవీ చేయకుండా..ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, పాటకి ఎంతవరకూ అవసరమో..నిర్మాత ఇచ్చే బడ్జెట్ ఎంతో అంతలోనే కలర్ఫుల్గా.. రిచ్‌గా సాంగ్స్ ఇస్తున్నారు భాను. ఈ మధ్యకాలంలో విరివిగా సాంగ్స్‌కి డాన్స్ కంపోజ్ చేస్తూ, ఇంత బిజిగా ఉన్నాడంటే.. ఆయనకి దక్కుతున్న ఆదరణ అటువంటిది.
చిరు-వెంకీ-బాలయ్యలతో మరిచిపోని క్షణాలు:
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్స్‌కి డాన్స్ కంపోజ్ చేసి ప్రశంసలు అందుకున్నారు భాను మాస్టర్. "సంక్రాంతికి వస్తున్నాం" సింగిల్ కార్డ్, "మన శంకరవరప్రసాద్‌గారు"లో "ఓ శశిరేఖ" సాంగ్, బాలయ్యతో చేసిన "జాజికాయ" సాంగ్ భానుకి ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఈ సినిమాల తర్వాత చాలా బిజీ అయ్యారు భాను. ముఖ్యంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్-అనిల్ రావిపూడి-బోయపాటి శ్రీనులకి ఎంతో దగ్గరయ్యాడు. తమ సినిమాల కోసం భానుకి ఫోన్ కాల్ వెళుతుందంటే..వారి దృష్టిలో భాను ఎంత బలంగా పాతుకుపోయాడో అర్థం చేసుకోవచ్చు.
వల్గారిటీకి (అసభ్యత) నో ఛాన్స్:
సాధారణంగా మన సినిమా ఇండస్ట్రీలో సాంగ్స్ అంటే, పాటలో ఎక్కడో ఒక చోట..ఏదో ఒక మూవ్మెంట్లో గ్లామర్ యాడ్ చేయాలని స్పెషల్‌గా హీరోయిన్ నాభి మీదనో..స్థనాలమీదనో..నడుము మీదనో, ఓ.. కెమెరాను పెట్టి టైట్ క్లోజ్ షాట్స్ పెట్టి తీప్పేస్తుంటారు. దాదాపు, చాలామంది డాన్స్ మాస్టర్స్ ఇలా చేస్తున్నవారే. కానీ, భాను వీరందరికీ భిన్నం. ఇప్పటి, వరకూ ఆయన డాన్స్ కొరియోగ్రఫీ అందించిన ఏ పాటలోనూ హీరోయిన్ మీద స్పెషల్‌గా అలాంటి ఫ్రేమ్ పెట్టింది లేదు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు:
తాజగా, భానూ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించిన సినిమా ఆదర్శకుటుంబం. వెంకీ, డింపుల్ హయాతి, నివేతా, శ్రీనిధిలపై పిక్చరైజ్ చేసిన "నారాయణమ్మ" సాంగ్ థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది మొత్తం ఏ ఫంక్షన్స్లోనైనా ఇదే పాట వినిపించడం గ్యారెంటీ. అలాగే, సంపత్ నంది-శర్వానంద్ కాంబినేషన్లో వస్తోన్న "భోగి" సినిమాలో సాంగ్ ఎంతో ప్రత్యేకంగా నిలవబోతోంది. హుషారు 2లో మూడు పాటలకి డాన్స్ కొరియోగ్రఫీ అందించారు భాను. "జనవరి 12 విడుదల", మేక రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఏదో ఏదో ఇది" లాంటి సినిమాలకి ఆయన అందించిన సాంగ్స్ చాలా ప్రత్యేకంగా నిలవనున్నాయి.
నందమూరి తేజస్వినితో భాను:
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయి, యూట్యూబ్‌లో ట్రెండ్ అయి..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన వీడియో భానూ మాస్టర్ నందమూరి బాలకృష్ణ కూతురు తేజశ్వనీతో కలిసి చేసిన డాన్స్ వీడియో. అనుకోకుండా చేసిన ఈ వీడియో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఈ వీడియో తర్వాత తేజశ్వినీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారమూ మొదలైంది. కెమెరా ముందు ఎంతో హుషారుగా కనిపించే భానూ, బయట మాత్రం చాలా సింపుల్‌గా కనిపించి షాకిస్తుంటారు. అసలు..ఇలాంటి స్టార్స్‌తో పనిచేసిన భానునేనా ఇతను! అని షాకిస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగుండాలని చూపించడానికి భాను ఇప్పుడున్న మాస్టర్స్‌లో మంచి ఉదాహరణ.


