సినిమా

Tollywood: పీరియాడికల్ సినిమాలు ఎందుకు మెప్పించలేకపోతున్నాయి?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: కమర్షియల్ సినిమాలతో హిట్ కొట్టొచ్చు. ఫ్యామిలీ సినిమాలతో మంచి కలెక్షన్స్ రాబట్టొచ్చు. డివోషనల్ సినిమాలతో రికార్డ్స్ సాధించవచ్చు. ఇలా, జానర్ ఏదైనా బలమైన కథ-కథనం, ఎమోషన్స్ ఉంటే సినిమా హిట్ గ్యారెంటీ. అయితే, పీరియాడికల్ సినిమా చేయాలంటేనే ఎంతో కష్టపడాలి..రీసెర్చ్ చేయాలి..ప్రేక్షకులను మెప్పించే అన్నీ ఎమోషన్స్ మిస్ కాకుండా బ్యాలెన్స్ చేయాలి.

Tollywood: కమర్షియల్ సినిమాలతో హిట్ కొట్టొచ్చు. ఫ్యామిలీ సినిమాలతో మంచి కలెక్షన్స్ రాబట్టొచ్చు. డివోషనల్ సినిమాలతో రికార్డ్స్ సాధించవచ్చు. ఇలా, జానర్ ఏదైనా బలమైన కథ-కథనం, ఎమోషన్స్ ఉంటే సినిమా హిట్ గ్యారెంటీ. అయితే, పీరియాడికల్ సినిమా చేయాలంటేనే ఎంతో కష్టపడాలి..రీసెర్చ్ చేయాలి..ప్రేక్షకులను మెప్పించే అన్నీ ఎమోషన్స్ మిస్ కాకుండా బ్యాలెన్స్ చేయాలి. అలా, కుదరకనే రణబాలి లాంటి సినిమాలు మెప్పించలేకపోతున్నాయి. అదే, సందేహం ఇప్పుడు ఫౌజీపైన కూడా మొదలైంది.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా కూడా పీరియాడికల్ సినిమా. ఈ సినిమాను రెండో ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం నేపథ్యంలో హను తెరకెక్కిస్తున్నాడు. 1940ల కాలంలో జరిగే కథతో, ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సంబంధించిన సైనికుడి పాత్రను ఎంతో బలంగా తీర్చిదిద్దగా..ఈ పాత్రలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్నాడు. ఇప్పటికే, ప్రభాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

అయితే, ప్రభాస్ కి ఉన్న స్టార్‌డమ్‌తో పాటు ఇండియన్ హిస్టరీలోలో పెద్దగా పరిచయం లేని అంశాన్ని ఫౌజీ కోసం ఎంచుకోవడం మాత్రమే చాలదు. ఫస్ట్ హాఫ్ లో బలమైన కథనం, సెకండాఫ్‌లో కథ డ్రాపవకుండా భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన సంఘర్షణలు, కొత్తగా అనిపించే కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన బాధ్యత దర్శకుడి మీదే ఉంది.

ఇవన్నీ, దర్శకుడు హను రాఘవపూడి గనక ‘ఫౌజీ’ సినిమాలో చూపించగలిగితే ప్రేక్షకులను మెప్పిస్తుంది. లేదంటే, రణబాలి సినిమాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఈ జానర్ ను ఎంచుకున్న దర్శకులు ఇంతకముందు ఫ్లాప్స్ చూశారు. మెగాస్టార్ చేసిన సైరా, వరుణ్ తేజ్ నటించిన కంచె, వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్ సినిమాలలో ఈ అంశాలు మిస్ అవడం వల్లే ఫలితం ఊహించినదానికంటే భిన్నంగా వచ్చింది. మరి, ప్రభాస్ ఫౌజీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

#Prabhas#Fauzi#Vijay Devarakonda#Ranabaali
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి