ఏపీ

AP : సీఈసీ నియామకంపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

రచన: Kumar••6 నిమిషాల పఠనం

దేశం, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు.ఓటు చోరీ, ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని విపక్షాల ఆరోపణలు, దీంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, సీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తున్న వేళ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దేశం, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు.ఓటు చోరీ, ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని విపక్షాల ఆరోపణలు, దీంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, సీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తున్న వేళ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఈసీ రాజీనామా అంశంలో నేరుగా స్పందించకుండానే ఆయన నియామకాన్ని తప్పుబట్టారు.

కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని అధికార పార్టీలు చేపట్టకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఈసీ నియామకం న్యూట్రల్ బాడీస్ ద్వారా జరగాలని ఆకాంక్షించారు. గతంలో ఆ ప్రతిపాదనకు అంగీకరించి తప్పు చేశామని, అందుకే మార్పు రావాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.సీఈసీ నియామకంలో సంస్కరణలు రావాలని, మళ్లీ న్యూట్రల్ బాడీ ద్వారా సీఈసీ నియామకం జరగాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

జనసేనలోకి టీడీపీ నేతలు.. కీలక సీట్లు

దీంతో పాటు ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జగన్ స్పందించారు. కావాలనే టీడీపీ నేతలు రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కూటమిలోని పార్టనర్ పార్టీలకు టెంట్ సామన్లు సరఫరా చేసినట్లు తన పార్టీ నాయకులను చంద్రబాబు నాయుడు సప్లయ్ చేస్తున్నాడని సెటైర్లు వేశారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిపితే గెలుస్తామని చంద్రబాబు నాయుడుకు నమ్మకం లేక ఇలా దాడులకు తెగబడుతున్నాడని ఆరోపించారు.

ముందస్తు ప్లాన్‌లో భాగమేనా?

ఇదిలాఉండగా, స్థానిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీల్లో చిత్రవిచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నుంచి జనసేనలో చేరిన వారికి పవన్ కళ్యాణ్ కీలక సీట్లు కేటాయించారు. ఇటీవల టీడీపీ నుంచి వంగవీటి రాధా జనసేనలో చేరగా..ఆయనను విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా జనసేన ప్రకటించింది. అదే విధంగా మళ్ల గణేష్ - మళ్ల మీనాక్షి దంపతులు తుని మున్సిపాలిటీలో టీడీపీ నుండి టికెట్ ఆశించి భంగపడి, జనసేనలో చేరారు. మాజీ కౌన్సిలర్ మళ్ల గణేష్ భార్య మళ్ల మీనాక్షికి తుని మున్సిపల్ చైర్‌పర్సన్ సీటును జనసేన తాజాగా కేటాయించింది.

నిరాశలో జనసైనికులు

అలాగే టీడీపీ నుంచి వచ్చిన రెడ్డి అప్పలనాయుడుకు ఏలూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా జనసేన అవకాశం కల్పించింది. వీరితో పాటు జనసేన తరఫున ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నాయకుడు దారం సుబ్బారావు నామినేషన్ దాఖలు చేయడం విశేషం. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో భాగంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి 25 పట్టణ స్థానిక సంస్థలు (4 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు) దక్కగా, ఇందులో టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది.ఇదే విషయంపై మాజీ సీఎం జగన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన వాళ్లను జనసేనలోకి కావాలనే పంపించి టికెట్లు ఇప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాగా, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాల వలన అసలైన జనసైనికులు తీవ్ర నిరాశలో ఉన్నట్టు సమాచారం.

#ex cm jaganmohan reddy#ysrcp#TDP#Janasena#politics#CEC#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి