Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ మూవీ కూడా ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భధ్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక, ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రటించారు. 2027, అక్టోబర్ 29న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.
వాస్తవానికి, ఈ సినిమాను 2027 మార్చి 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా అనూహ్యంగా విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబర్ 3న రిలీజ్ చేస్తామని ప్రకటించిన నిర్మాతలు..ఇంకా, షూటింగ్ పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాది మార్చి 18న రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
అంతేకాదు, ఫౌజీ కోసం బల్క్ డేట్స్ ఇవ్వడం వల్ల స్పిరిట్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ప్రభాస్ సినిమాల లైనప్..వాటి విడుదల తేదీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మార్చిలో అనుకున్న స్పిరిట్ వచ్చే ఏడాది అక్టోబర్ 29కి వాయిదా పడింది. అదే మార్చి నెలకి ఫౌజీ షిఫ్ట్ అయింది. కానీ, ఇంకా హను రాఘపూడి నుంచి గానీ, మైత్రీ వారి నుంచి గానీ మార్చిలో రిలీజ్ అనుకుంటున్న ఫౌజీ అఫీషియల్ రిలీజ్ డేట్ రాలేదు.
మొత్తానికి, ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగానే ఫౌజీ, స్పిరిట్ సినిమాల వాయిదా కన్ఫర్మ్ అయింది. ఇక, కల్కీ సినిమా 2028లో ఉండొచ్చునని ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్తో అర్థమవుతోంది. కాస్త అటు ఇటుగా సలార్ సీక్వెల్ కూడా ఉండే అవకాశాలున్నాయి. కానీ, ఇక్కడ సమస్యల్లా.. ఈ రకంగా, నెలలకి నెలలు ప్రభాస్ సినిమాలు వాయిదా పడుతుంటే..బడ్జెట్ పెరగడంతో పాటు ఓటీటీల నుంచి ఇబ్బందులు తలెత్తడం గ్యారెంటీ. వీటన్నిటినీ నిర్మాతలు ఎలా భరిస్తారో మరి.


