వైరల్ న్యూస్

Viral : ఫ్రీగా వస్తే దేన్నీ వదలరు.. ఐ ఫోన్స్‌ను వదిలేస్తారా?

రచన: Kumar••5 నిమిషాల పఠనం

కొందరు జనాలు ఎలా ఉంటారంటే ఫ్రీగా వస్తే దేన్ని వదలరు. చీపురు పుల్ల నుంచి అగ్గిపెట్టె వరకు ఉచితంగా ఇస్తున్నారంటే అందరి కంటే ముందు గా వెళ్లి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ మెంటాలిటీ ప్రతి నలుగురిలో ముగ్గురికి ఉంటుంది. డబ్బులు మాత్రం పోవద్దు..

కొందరు జనాలు ఎలా ఉంటారంటే ఫ్రీగా వస్తే దేన్ని వదలరు. చీపురు పుల్ల నుంచి అగ్గిపెట్టె వరకు ఉచితంగా ఇస్తున్నారంటే అందరి కంటే ముందు గా వెళ్లి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ మెంటాలిటీ ప్రతి నలుగురిలో ముగ్గురికి ఉంటుంది. డబ్బులు మాత్రం పోవద్దు.. ఉచితంగా వస్తే సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరి వెళ్లి తెచ్చుకుంటారు. ముందుగానే లెక్కలు కూడా వేస్తారు.మనం ఎంత ఖర్చు చేస్తున్నాం.. ఎంత లాభం ఉందో చూసుకుని ఇవన్నీ చేస్తుంటారు. లాభం లేదంటే ఏ పని చేయరు. అందుకోసం కొన్నిసార్లు తమ ప్రాణాలను సైతం రిస్క్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు నేటి సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు.

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ మాంద్యం పరిస్థితులు కనిపించడం, నిరుద్యోగం ,ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో జనాలు తమకు ఎవరైనా ఆదుకోకపోతారా? అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా ఫ్రీగా వస్తువులు ఇస్తున్నారని తెలిస్తే చాలు.. లక్షల్లో అక్కడ బారులు తీరుతుంటారు. ఇటీవలి కాలంలో కొన్ని ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఓ షాప్ యాజమాని క్లాత్స్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారని తెలిసి తండోపతండాలుగా అక్కడకు వెళ్లారు. తీరా ఆఫర్ లేదని తెలిసి నానారభస చేసి ఏకంగా షాపులోనే దొంగతనానికి సైతం పాల్పడ్డారు కొందరు.

ఇక రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో పండ్లు, కూల్ డ్రింక్స్, మద్యం లోడుతో వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురైన సమయంలో అందులోని క్షతగాత్రులకు సాయం చేయాల్సింది బదులు ఐటమ్స్ దొరికిన కాడికి అందుకుని జనాలు జంప్ అవుతున్న ఘటనలే అధికం.ఇటీవల మద్యం లోడుతో వెళ్తున్న ఓ వాహనం బోల్తా పడి కిందిపడి పగిలిపోయిన మద్యం బాటిళ్లు, మిగతా మద్యాన్ని స్థానిక జనాలు ఎత్తుకెళ్లారు.రోడ్డు మీద పడిపోయిన తక్కువ బడ్జెట్ ఐటమ్స్‌ను కూడా వదలని జనాలు..ఇక ఫ్రీగా ఐఫోన్ దొరకుతుందని తెలిస్తే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు.

ఈ క్రమంలోనే హోర్ముజ్ జలసంధిలో మునిగిపోయిన ఓ నౌక కంటెనర్‌లో రూ.కోట్ల విలువైన ఐఫోన్స్ నీళ్లలో పడిపోగా అవన్నీ తేలుతూ తీరానికి కొట్టుకొస్తున్నట్టు తెలిసింది.మూడు రోజుల కింద కార్గో షిప్ సీ మైన్‌ను ఢీకొట్టగా మంటలు చెలరేగి ప్రమాదవశాత్తు ఆ నౌక నీట మునిగింది. అందులోని కంటెనర్లలో ఒకటి బ్రేక్ అవ్వగా..దాని నుంచి ఐఫోన్స్ బయటపడ్డాయి. అవన్నీ నీటిలో తేలియాడుతూ కనిపించాయి. అవి నెమ్మదిగా తీరానికి కొట్టుకొస్తుండటంతో వాటిని తీసుకోడానికి తీరం ప్రజలు ఎగబడినట్టు తెలుస్తోంది. చేపల వేటకు వెళ్లే పడవల ద్వారా సముద్రంలోకి వెళ్లి ఐఫోన్స్ తీసుసుకోవడంతో పాటు పర్ఫ్యూమ్స్ తీసుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలాఉండగా, ఆ వీడియోలు, ఇమెజెస్ ఏఐ ద్వారా చేసినవి అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా,ఐఫోన్ వెర్షన్స్ కొత్తగా వస్తే చాలు రూ. లక్షలు పెట్టి కొనుగోలు చేసేందుకు లైన్లలో ఉండే యువత, ప్రజానీకం.. అదే ఉచితంగా దొరికితే ఊరుకుంటారా? అంటూ ప్రచారం జరుగుతోంది.

#I phones#sea#hormuz straight#collection#swechaanews#viral
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి