సినిమా

Tollywood Actress: ఫ్లాపుల నుంచి ఈ హీరోయిన్స్ బయటపడగలరా?

రచన: Anshu6 నిమిషాల పఠనం

Tollywood Actress: సినిమా ఇండస్ట్రీలో గ్లామర్, క్రేజ్ ఎంత ముఖ్యమో.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అంతకంటే ముఖ్యం. ఒక్క హిట్ పడితే రాత్రికి రాత్రే స్టార్‌డమ్ తలకిందులైపోతుంది, అలాగే వరుస ప్లాపులు వస్తే ఎంతటి అగ్ర కథానాయికలకైనా ఆఫర్లు ఆవిరైపోతాయి. ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలిన కొందరు స్టార్ హీరోయిన్లు సరిగ్గా ఇలాంటి తీవ్రమైన కెరీర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

Tollywood Actress: సినిమా ఇండస్ట్రీలో గ్లామర్, క్రేజ్ ఎంత ముఖ్యమో.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం అంతకంటే ముఖ్యం. ఒక్క హిట్ పడితే రాత్రికి రాత్రే స్టార్‌డమ్ తలకిందులైపోతుంది, అలాగే వరుస ప్లాపులు వస్తే ఎంతటి అగ్ర కథానాయికలకైనా ఆఫర్లు ఆవిరైపోతాయి. ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలిన కొందరు స్టార్ హీరోయిన్లు సరిగ్గా ఇలాంటి తీవ్రమైన కెరీర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

పూజా హెగ్డే: ఒకప్పుడు పూజా హెగ్డే పేరు చెబితేనే నిర్మాతలు క్యూ కట్టేవారు. 'అల వైకుంఠపురములో' తర్వాత ఆమె గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్' నుంచి ఇటీవల వచ్చిన చిత్రాల వరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్నంత పాపులారిటీ ఆమె సినిమాలకు థియేటర్లలో దక్కడం లేదు. చేతిలో దల్కర్ సల్మాన్ చిత్రం, 'కాంచన 4' లాంటి లైనప్ ఉన్నప్పటికీ, పక్కా కమ్‌బ్యాక్ హిట్ పడితే తప్ప పూజ పూర్వ వైభవం సాధించడం కష్టమే.

శ్రీ‌లీల‌: తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్, వరుస అవకాశాలు దక్కించుకున్న భామ శ్రీలీల. 'పెళ్లి సందD', 'ధమాకా' చిత్రాల్లో ఆమె డ్యాన్సులు, ఎనర్జీ చూసి ఇండస్ట్రీ ఫిదా అయింది. కానీ, ఆ తర్వాత ఒకే తరహా పాత్రలు ఎంచుకోవడం, సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడంతో వరుస ప్లాపుల ట్రాక్‌లో పడిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఆమె పరువాల జోరు కాస్త తగ్గడంతో, తన దృష్టిని కోలీవుడ్, బాలీవుడ్ వైపు మళ్లిస్తోంది. ధనుష్, కార్తీక్ ఆర్యన్ ప్రాజెక్టులతో పాటు అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది.

కీర్తి సురేష్‌: 'మహానటి'గా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ యాక్టింగ్ పొటెన్షియల్ గురించి ఎవరికీ సందేహాలు లేవు. 'దసరా' లాంటి సినిమాలు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పటికీ, ఇటీవల ఆమె చేసిన కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు, బాలీవుడ్ ఎంట్రీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, వెంకటేష్ సరసన నటిస్తూ మళ్లీ తెలుగులో పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ వినోదాన్ని బ్యాలెన్స్ చేయడమే కీర్తికి ఇప్పుడున్న ఏకైక మార్గం.

కృతి శెట్టి: 'ఉప్పెన'తో ఊహించని రేంజ్‌లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి, తొలి మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ వేగం ఎంతో కాలం నిలవలేదు. తర్వాతి ప్రాజెక్ట్‌లు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తమిళంలో చేసిన ప్రయత్నాలు కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పైనే కృతి ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా క్లిక్ అయితేనే ఆమె కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది.

కాగా, ఒకప్పుడు హీరోయిన్ల‌కు క్రేజ్ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు ఆఫర్లకు కొదవ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొత్త ముఖాల రాక, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల మధ్య నిలదొక్కుకోవాలంటే కేవలం గ్లామర్ మాత్రమే సరిపోదు. కథల ఎంపికలో వైవిధ్యం, పాత్రల్లో కొత్తదనం చూపించగలిగితేనే ఈ గ్లామర్ డాల్స్ తమ ప్లాపుల స్ట్రీక్ నుంచి బయటపడి మళ్లీ నంబర్ వన్ రేసులో నిలబడగలరు.

#keerthysuresh#poojahegde#krithisetty#Sreeleela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి