వైరల్ న్యూస్

Tech Mahindra : వాష్ రూంకు పర్మిషనా? టెక్ మహింద్రాపై మహిళా టెకీ సంచలన ఆరోపణలు

రచన: Kumar4 నిమిషాల పఠనం

ప్రముఖ వ్యాపార దిగ్గజం టెక్ మహింద్రా కంపెనీపై ఓ యువ మహిళా టెకీ సంచలన ఆరోపణలు చేసింది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదని, అకారణంగా తనను జాబ్ నుంచి తొలగించాలని ఆమె ఓ వీడియో సందేశం ద్వారా పేర్కొన్నది.

ప్రముఖ వ్యాపార దిగ్గజం టెక్ మహింద్రా కంపెనీపై ఓ యువ మహిళా టెకీ సంచలన ఆరోపణలు చేసింది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదని, అకారణంగా తనను జాబ్ నుంచి తొలగించాలని ఆమె ఓ వీడియో సందేశం ద్వారా పేర్కొన్నది. వాస్తవానికి ప్రస్తుతం టెక్ రంగంలో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐ రాకతో జాబ్స్ పోతున్నాయని అందరికీ తెలిసిందే. కానీ, ఇక్కడ ఏఐ తనను భర్తీ చేయలేదని, అనవసరంగా తనను తొలగించారని ఓ యువ టెకీ సంచలన ఆరోపణలు చేసింది.

దీనికి తోడు సదరు కంపెనీపై మహిళా టెకీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా పేర్కొంది.ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. భావన అనే యువతి మూడు నెలల కిందట టెక్ మహింద్రా కంపెనీలో చేరింది. ప్రస్తుతానికి తను ప్రొబేషన్ పీరియడ్ లో ఉందని తెలిసింది. ఆఫీసులో ఉండగానే ఓ రోజు కళ్లు తిరిగి పడిపోగా.. కంపెనీ మేనెజ్మెంట్ ట్రీట్మెంట్ అందించి మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా హెల్త్ సెట్ కాకపోవడంతో తన ఇంటి దగ్గర వైద్యుడి వద్ద ఆమె చికిత్స తీసుకుంది.

ఆరోగ్యం బాగాలేక 13 రోజుల పాటు లీవ్ పెట్టినందుకు కారణం చెప్పకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించారని సదరు యువతి టెక్ మహింద్రా మీద ఆరోపణలు చేసింది. సెలవు కావాలని కోరితే మెయిల్స్ ద్వారా త్వరగా ఆఫీసుకు రావాలని కంపెనీ యాజమాన్యం తరచూ వేధించిందని భావన పేర్కొంది. అనంతరం తన పాపకు ఆరోగ్యం బాగాలేదని సెలవు పెడితే కూడా త్వరగా ఆఫీసుకు రావాలని, ఎన్ని రోజులు సెలవులో ఉంటారని ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తంచేసింది.

https://x.com/TeluguScribe/status/2080156342149677471?s=20

ఆఫీసులో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా పర్మిషన్ తీసుకుని వెళ్లాలని వేధిస్తారని, ఇలాంటి కంపెనీని ఎక్కడా చూడలేదని అసహనం చేసింది.మహిళా ఉద్యోగులకు కూడా కుటుంబాలు ఉంటాయని, వారిపై కఠినంగా వ్యవహరించకూడదని సాఫ్ట్‌వేర్ కంపెనీ యాజమాన్యాలకు యువతి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు యువతి తెలిపింది.

#tech mahindra#job remove#women employee#police compliant#harrasment
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి