తెలంగాణ

TG: ఎల్‌నినో ఎఫెక్ట్.. గిరిజనులకు 125 రోజుల పని!

రచన: Mahesh••2 నిమిషాల పఠనం

TG: ఎల్‌నినో దెబ్బకు కరువు ముంచుకొస్తున్న వేళ.. అడవి బిడ్డలు పనుల్లేక పస్తులుండే పరిస్థితి రాకూడదని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి కోసం గిరిజనులు ఊళ్లు విడిచి వలసలు పోకుండా ఉండేలా పక్కా ప్లాన్ రెడీ చేసింది. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద పనుల దినాలను ఏకంగా 125 రోజులకు పెంచుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. VB-G RAM G పథకం కింద అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి 125 రోజుల పని కల్పించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జాబ్ కార్డులు లేని కుటుంబాలకు వెంటనే కొత్త కార్డులు ఇచ్చేయాలని, ఇంట్లో 18 ఏళ్లు దాటిన యువకులు ఎందరున్నా అందరి పేర్లనూ వెంటనే జాబ్ కార్డుల్లో చేర్చి పని చూపించాలని చెప్పారు. కరువు వేళ గిరిజనులకు చేతినిండా పని కల్పించి భరోసా ఇచ్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

#Telangana#Telangana News#Telangana Government#Tribal Welfare#Tribal Employment#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి