TG: హైకోర్టు స్వయంగా ఆర్డర్ ఇచ్చినా రైతు బీమా డబ్బులు ఇవ్వకుండా అధికారులు లేట్ చేస్తుండటంతో ఓ బాధిత మహిళ నేరుగా రంగంలోకి దిగింది. తనకు న్యాయంగా రావాల్సిన రైతు బీమాను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.
సంస్థాన్ నారాయణపురం మండలం గోగులోనిభావికి చెందిన కళ్లెం మంజుల అనే మహిళ.. తన లాయర్ గుమ్మి రాజ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత మన్నె నర్సింహారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు జనార్దన్ రెడ్డి, జాన్ రెడ్డిలను వెంటబెట్టుకుని బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ ఐఏఎస్‌ను కలిశారు. హైకోర్టు ఆర్డర్ కాపీని ఆయన ముందు పెట్టి.. కోర్టు స్పష్టంగా చెప్పినా కింది స్థాయి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
దీనిపై వెంటనే స్పందించిన డైరెక్టర్ గోపీ.. వ్యవసాయ శాఖ అధికారులతో ఈ విషయంపై అక్కడికక్కడే విచారణ చేపట్టారు. కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని న్యాయం చేస్తామని మంజులకు హామీ ఇచ్చారు. ఉన్నతాధికారి స్వయంగా స్పందించి పరిశీలన మొదలుపెట్టడంతో, ఇన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైతు బీమా సమస్య త్వరలోనే కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.


