తెలంగాణ

పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం కరీంనగర్ సీపీ ప్రత్యేక ప్రార్థనలు

రచన: NK••2 నిమిషాల పఠనం

సమాజ శాంతి కోసం అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక సవరన్ మసీదులో సీపీ గౌస్ ఆలం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Karimnagar CP: సమాజ శాంతి కోసం అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక సవరన్ మసీదులో సీపీ గౌస్ ఆలం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సమాజ రక్షణ కోసం, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించారు. అలాగే పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేమం, ప్రజా సంక్షేమం కోరుతూ ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీతో పాటు ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, విజయకుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

#Karimnagar CP#Gaush Alam#Special Prayers#Swechaa News#Police Commemoration Day
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి