తెలంగాణ

ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీళ్లు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

రచన: NK•••4 నిమిషాల పఠనం

Cm Revanth: ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బోధి పెవిలియన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Cm Revanth: ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బోధి పెవిలియన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు

ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. తుమ్మిడిహెట్టిపై త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు పిలుస్తానని ఇటీవలే మహారాష్ట్ర సీఎం సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని తీసుకునే వీలుంది, మహారాష్ట్ర పరిధిలో ఎంతమేరకు ముంపునకు గురవుతుందో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరు

అటవీ, గిరిజన, వెనుకబడ్డ ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా బ్యారేజీ ఎత్తు ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్రను ఒప్పించేందుకు వీలుగా అవసరమైన అన్ని నివేదికలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల వివరాలన్నీ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లు

డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అందుకు వీలుగా శ్రీశైలం, నార్లాపూర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని ఏదుల వరకు అదనంగా తెచ్చుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. దీంతో పాలమూరు నీటికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు. అందుకు అవసరమైన పంప్ హౌస్‌లు, పంపులు, సిస్టమ్ వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

#Cm Revanth Reddy#Irrigation Projects#Telangana#Cm Revnath#Dindi#Edula#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి