తెలంగాణ

TG : సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లంచావతారులు.. ఏసీబీకి ఇలా ఫిర్యాదు చేయండి : నారగోని ప్రవీణ్

రచన: Kumar••6 నిమిషాల పఠనం

తెలంగాణలోని చాలా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో విపరీతమైన లంచాలు నడుస్తున్నాయని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బులు వసూలు చేయడం, సాయంత్రం లెక్క చూడటం అధికారులకు పరిపాటిగా మారిందని అన్నారు.

తెలంగాణలోని చాలా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో విపరీతమైన లంచాలు నడుస్తున్నాయని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బులు వసూలు చేయడం, సాయంత్రం లెక్క చూడటం అధికారులకు పరిపాటిగా మారిందని అన్నారు. ఈ విషయం ఏసీబీకి దృష్టికి కూడా వచ్చిందని, అందుకే గత ఒకటి,రెండేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు.

అవినీతినిరోధక శాఖ (ACB) ప్రతిశాఖ వారీగా లెక్క విడిగా ప్రకటించదన్నారు. కానీ 2025 వార్షిక నివేదిక ప్రకారం మొత్తంగా 199 కేసులు నమోదు అయ్యాయని, 273 మంది అవినీతి అధికారులు అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు.అందులో 157 ట్రాప్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఏసీబీ దాడులు అధికంగా జరిగే శాఖలో రెవెన్యూ విభాగం టాప్‌లో ఉందన్నారు.కాగా, ఇకమీదట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌-1064కు కాల్ చేయాలని పిలుపునిచ్చారు.

అంతేకాకుండా ఏసీబీ వాట్సాప్- 9440446106, వెబ్‌సైట్ acb.telangana.gov.in లో కూడా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లంచం డిమాండ్ చేసిన వారి వివరాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, డాక్యుమెంట్ రైటర్ పేరు, డిమాండ్ చేసిన మొత్తం, ఆడియో/వీడియో ఉంటే జతచేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఏసీబీకి చిక్కిన దొరికిన వారి వివరాలు వెల్లడించారు.

పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్లు..

20 ఏప్రిల్ 2026న హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సర్‌ప్రైజ్ సోదాలు జరిపింది. 20 మంది అనధికార డాక్యుమెంట్ రైటర్లు, లెక్కలేని నగదు రూ.47,450 దొరికాయి. విచారణలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు - దావులూరి ఆనంద్, జమలాపురం రామనరసింహారావు అరెస్ట్ అయ్యారు. ఇక ఆనంద్ ఫోన్‌లో 8 రోజుల కలెక్షన్ రూ.16.23 లక్షలు, మొత్తం ఫోన్ పే, యూపీఐ ద్వారా రూ.44.28 లక్షల లావాదేవీలు బయటపడ్డాయి.

అదే విధంగా 20 ఫిబ్రవరి 2026లో మంథని సబ్ రిజిస్ట్రార్ కసర్ల రాజేందర్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా రైతు నుంచి రూ.16,500 లంచం తీసుకుంటూ ట్రాప్‌లో దొరికిపోయారు. 22 ఆగస్ట్ 2025న వనస్థలిపురంలో సబ్ రిజిస్ట్రార్ రాజేష్ కుమార్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.1 లక్ష డిమాండ్ చేసి, టైపిస్ట్ రమేష్ ద్వారా రూ.70,000 తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

22 ఆగస్ట్ 2025న ఆదిలాబాద్‌లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కె.శ్రీనివాస రెడ్డి గిఫ్ట్ డీడ్ కోసం రూ.5,000 లంచం తీసుకుంటూ అరెస్ట్ అయ్యాడు. 15 అక్టోబర్ 2025న వేములవాడ రూరల్‌లో తహశీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ Md అబూబకర్ రూ.8,000 లంచం తీసుకుంటూ దొరికాడు. మెట్పల్లిలో 15 జనవరి 2025న సబ్ రిజిస్ట్రార్, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ముగ్గురూ ట్రాప్ లో దొరికారు. నారాయణపేట, బీబీనగర్, సదాశివపేట, జడ్చర్లలలో కూడా 2025 జులై 17న ఏకాలంలో సర్‌ప్రైజ్ చెకింగ్‌లు జరిగాయి.

లంచం తీసుకొని దొరికితే పడే శిక్షలు..

లంచం తీసుకుని ఎవరైనా పట్టుబడితే అవినీతి నిరోధక చట్టం సెక్షన్త -7 కింద క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో దోషిగా తేలితే 3 నుండి 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. పట్టుబడిన వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఉద్యోగం నుంచి తొలగింపు వరకు వెళ్తుంది.

#ACB#bribe#TRA state president naragoni praveen#compliants#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి