తెలంగాణ

Elnino: ‎ఎల్‌నినోపై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం

రచన: NK•••3 నిమిషాల పఠనం

సచివాలయంలో తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, సబ్-కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ‎రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్ నినో పరిస్థితులను అధిగమించేందుకు, తగిన చర్యలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు

Elnino: సచివాలయంలో తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, సబ్-కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ‎రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్ నినో పరిస్థితులను అధిగమించేందుకు, తగిన చర్యలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ‎​

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కరువు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన ఉపశమనం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ‎​ఈ సమావేశానికి సబ్-కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజుతో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

ఎల్ నినోపై గ్రామ స్థాయిలో వివరించేలా ఈ భేటీలో కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారని సమాచారం. వర్షపాతం, తాగునీరు, సాగునీరు, విద్యుత్ పై చర్చించి పరిస్థితి తీవ్రతపై రైతులకు చర్చించేలా కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై సమగ్ర ప్రణాళిక రూపొందించబోతున్నారు. ఈ మీటింగ్ తర్వాత సబ్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు.

#Elnino#Telangana Cabinet Sub Committee#Drought#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి