తెలంగాణ

TG: కాలువ జాగాలకే ఎసరు.. తహసీల్దార్ సహా ముగ్గురు అధికారులు సస్పెండ్!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: సర్కారు జాగాలను కాపాడాల్సినోళ్లే కబ్జాదారులతో చేతులు కలిపితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చేశారు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్. సాక్షాత్తూ నాగార్జునసాగర్ కాలువ భూములు, సీలింగ్ భూములను కాజేసేందుకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై వేటు వేశారు.

TG: సర్కారు జాగాలను కాపాడాల్సినోళ్లే కబ్జాదారులతో చేతులు కలిపితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చేశారు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్. సాక్షాత్తూ నాగార్జునసాగర్ కాలువ భూములు, సీలింగ్ భూములను కాజేసేందుకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై వేటు వేశారు. హుజూర్‌నగర్ తహసీల్దార్ కవితతో పాటు ఆర్ఐ కాశీం షరీఫ్, జీపీవో జానీ పాషాలను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

హుజూర్‌నగర్‌లోని 458, 281 సర్వే నంబర్ల పరిధిలో పెద్ద ఎత్తున భూ దందా జరిగినట్లు ఆర్డీవో విచారణలో తేలింది. సాగునీటి కాలువలకు చెందిన భూములను అసలు రికార్డులు చూడకుండా, కోర్టు ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా తప్పుడు రిపోర్టులు ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్లకు వీళ్లు సహకరించారని బయటపడింది. ఆఫీసర్ల సీట్లలో కూర్చుని ప్రభుత్వ భూములకే ఎసరు పెట్టేలా వ్యవహరించడంతో కలెక్టర్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

ముగ్గురినీ సస్పెండ్ చేయడమే కాకుండా.. తప్పుడు కాగితాలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారిపైనా క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించారు. సాగునీటి కాలువ భూములను కొట్టేయాలని చూస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, జైలుకు పంపుతామని హెచ్చరించారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రెవెన్యూ వర్గాల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది.

#Telangana#Telangana News#Suryapet#Suryapet News#Huzurnagar#Huzurnagar News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి