తెలంగాణ

TG: తెలంగాణలో జనగణన 2027 షెడ్యూల్ ఇదే..

4 నిమిషాల పఠనం

TG: తెలంగాణలో అధికారికంగా జనాభా లెక్కల సేకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ‘జనగణన-2027’ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు సమగ్ర షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

TG: తెలంగాణలో అధికారికంగా జనాభా లెక్కల సేకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ‘జనగణన-2027’ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు సమగ్ర షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ గెజిట్‌లో పునఃప్రచురించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఈ భారీ కసరత్తును పకడ్బందీగా పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని విభాగాల అధికారులను ఆదేశించింది.

దశలవారీగా జనగణన షెడ్యూల్:

ఈసారి సాంకేతికతను జోడించి, ప్రజల భాగస్వామ్యంతో మూడు దశల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ జనగణన ప్రక్రియను ప్రభుత్వం మూడు దశల్లో పూర్తి చేయనుంది. ఇందులో భాగంగా ముందుగా 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు తమ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా కుటుంబ వివరాలను సొంతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే 'స్వీయ గణన'కు అవకాశం కల్పించారు. ఆ తర్వాత జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యూమరేటర్లు నేరుగా ప్రతి ఇంటికీ వచ్చి కుటుంబ సభ్యుల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సేకరిస్తారు. చివరగా, ఎవరైనా వివరాలు నమోదు కాకుండా మిగిలిపోయినా లేదా ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నా సరిదిద్దేందుకు మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక రివిజనల్ రౌండ్ నిర్వహిస్తారు.

మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలే ప్రామాణికం

జనాభా లెక్కల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు ప్రభుత్వం 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలను కటాఫ్ సమయంగా నిర్ణయించింది. సరిగ్గా ఆ సమయానికి కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నారు, వారి పరిస్థితి ఏంటనే ప్రాతిపదికనే తుది లెక్కలు తేలుస్తారు. రేపు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నా, అభివృద్ధి ప్రణాళికలు వేయాలన్నా ఈ లెక్కలే కీలకం. అందుకే రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

#Telangana Census 2027#Census 2027#Telangana Government#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి